ETV Bharat / state

ఈఎంఐ డబ్బులు చెల్లించలేదని సోదరుడికి యువతి న్యూడ్​ ఫొటోలు - RECOVERY AGENTS ARREST

యువతి ఈఎంఐ డబ్బులు చెల్లించలేదని లోన్​ యాప్​ దారుణం - యువతి న్యూడ్​ ఫొటోలను పంపిస్తానంటూ బెదిరింపులు - ఆమె కుటుంబ సభ్యులు, బంధువులకు ఫోన్​ చేసి దూషణలు

Loan App Recovery Agents Arrest
Loan App Recovery Agents Arrest (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 17 hours ago

Updated : 15 hours ago

Loan App Recovery Agents Arrest : ఈఎంఐ(EMI) డబ్బులు కట్టలేదని ఓ యువతి న్యూడ్​ ఫొటోలను కుటుంబ సభ్యులకు షేర్​ చేసిన ఇద్దరు రికవరీ ఏజెంట్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​లోని తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో జరిగింది. అంతకుముందు యువతి బంధువులు, కుటుంబ సభ్యులకు ఫోన్​ చేసి లోన్​ డబ్బులు చెల్లించలేదని దుర్భాషలాడారని పోలీసులు తెలిపారు. యువతి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఇద్దరు ఏజెంట్లను అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు మీడియాకు వెల్లడించారు.

తిరుపతి జిల్లా సూళ్లూరుపేటకు చెందిన యువతి హైదరాబాద్​ నగరంలో సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​గా వర్క్​ చేస్తోంది. ఆరు నెలల కిందట ఆమె ఫినబుల్​ అనే లోన్​ యాప్​లో ఈఎంఐ పద్ధతిలో లోన్​ తీసుకుంది. సమయానికి ఆమె ఈఎంఐ చెల్లించలేదు. దీంతో డబ్బులు చెల్లించకపోతే యువతి ఫొటోలను అసభ్యకరంగా మార్చి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తామని రికవరీ ఏజెంట్లు ఆమెను బెదిరించారు. అంతే కాకుండా బాధితురాలి తల్లిదండ్రులు, బంధువులను కూడా ఫోన్​ చేసి డబ్బులు కట్టలేదని నోటికి వచ్చినట్లు దూషించారు.

అయినా సరే అంతటితో ఆగకుండా రికవరీ ఏజెంట్లు ఆమె సోదరుడికి కొన్ని న్యూడ్​ ఫొటోలను కూడా పంపించారు. వారి వేధింపులు తాళలేక యువతి పోలీసులను ఆశ్రయించిందని జిల్లా ఎస్పీ తెలిపారు. వెంటనే స్పందించిన పోలీసులు ఇద్దరి నిందితులను అరెస్టు చేశారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు లోన్​ తీసుకునే వారికి కొన్ని జాగ్రత్తలు చెప్పారు. నాన్​ బ్యాంకింగ్​ పైనాన్స్​ కంపెనీల వద్ద రుణాలు తీసుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఫినబుల్​ లోన్​ యాప్​పై సైబర్​ క్రైమ్​ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

"సూళ్లూరుపేటకు చెందిన యువతి హైదరాబాద్​ నగరంలో సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​. ఆరు నెలల కిందట ఆమె ఫినబుల్​ అనే లోన్​ యాప్​లో ఈఎంఐ పద్ధతిలో లోన్​ తీసుకుంది. ఐదు ఈఎంఐలు కట్టిన తర్వాత ఆరో ఈఎంఐ సరైన సమయానికి కట్టలేదు. అప్పటి నుంచి లోన్​ రికవరీ ఏజెంట్ల వేధింపులు మొదలయ్యాయి. యువతి న్యూడ్​ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పెడతామని బెదిరింపు. పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి. ఇద్దరు నిందితులు అరెస్ట్. లోన్​ యాప్​లపై అప్రమత్తంగా ఉండాలి." - సుబ్బారాయుడు, తిరుపతి జిల్లా ఎస్పీ

లోన్​ యాప్​లతో జాగ్రత్త : ఈ మధ్యకాలంలో లోన్​ యాప్​ల బాధితులు ఎక్కువైపోయారు. లోన్​ యాప్​ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది తమకు జరిగిన అవమానాలను బయటకు చెప్పలేక గుట్టుచప్పుడు కాకుండా ఉంటున్నారు. ఇలా నాన్​ బ్యాంకింగ్​ ఫైనాన్స్​ కంపెనీల వద్ద నుంచి రుణాలు తీసుకున్నప్పుడు జాగ్రత్తలు పాటించడమే నయం. ఇంకా చెప్పాలంటే లోన్​ యాప్​లో రుణాలు తీసుకోకపోవడమే ఉత్తమం. ఎందుకంటే వారు మన దగ్గర నుంచి వ్యక్తిగత సమాచారాన్ని స్వీకరించి, లోన్​ కట్టకపోతే వేధింపులకు దిగుతారు. చివరికి అవి ప్రాణాలు కోల్పోయే స్థాయివరకు వెళుతున్నాయి.

ఫేక్​ లోన్​ యాప్​లను ఇలా గుర్తించండి! - ఆ వలలో పడిపోతే అంతే!

డిజిటల్​ లోన్ తీసుకుంటున్నారా? ఇచ్చేవాళ్లు ఫేక్​ బ్యాచ్​ అయితే డేంజర్! ఇలా చెక్​ చేయండి

Last Updated : 15 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.