తెలంగాణ

telangana

ETV Bharat / state

శబరిమల భక్తులకు శుభవార్త​ - తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్లు - SPECIAL TRAINS FOR AYYAPPA DEVOTEES

అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్‌ - ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి 62 ప్రత్యేక రైళ్లను నడపనున్న సౌత్​ సెంట్రల్​ రైల్వే

Sabarimal Special Trains
Special Trains For Ayyappa Devotees (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 26, 2024, 3:30 PM IST

Updated : Nov 26, 2024, 3:38 PM IST

Special Trains For Ayyappa Devotees :ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం కోసం శబరిమల కొండకు వెళ్తున్న భక్తులకు శుభవార్త. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సౌత్​ సెంట్రల్ రైల్వే విశాఖపట్నం, శ్రీకాకుళం రోడ్‌, హైదరాబాద్‌, కాచిగూడ స్టేషన్​ నుంచి కొల్లం, కొట్టాయంలకు పెద్ద సంఖ్యలో స్పెషల్​ ట్రైన్స్ సర్వీసులను ఏర్పాటు చేసింది.

Sabarimala Special Trains (ETV Bharat)

ఈ ప్రత్యేక రైళ్లు డిసెంబర్‌ 1 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 27 వరకు వివిధ తేదీల్లో విశాఖపట్నం, శ్రీకాకుళం నుంచి కొల్లంకు 44 స్పెషల్ ట్రైన్స్ సర్వీసులు అందించనున్నాయి. వీటిలో వైజాగ్ - కొల్లం - విశాఖ ప్రత్యేక రైళ్లు (08539/08540) డిసెంబర్‌ 4 నుంచి ఫిబ్రవరి 27 వరకు 26 సర్వీసులు అందించనున్నాయి. విశాఖ - కొల్లం స్పెషల్​ ట్రైన్ (08539) ప్రతి బుధవారం ఉదయం 8.20 గంటలకు విశాఖలో బయల్దేరి గురువారం మధ్యాహ్నం 12.55 గంటలకు కొల్లం స్టేషన్​కు చేరుకోనుంది. కొల్లం - విశాఖ రైలు (08540) డిసెంబర్‌ 5 నుంచి ఫిబ్రవరి 27 వరకు ప్రతి గురువారం కొల్లంలో రాత్రి 7.35 గంటలకు బయల్దేరి శుక్రవారం రాత్రి 11.20 గంటలకు వైజాగ్ చేరుకుంటుంది.

అలాగే, శ్రీకాకుళం రోడ్‌ - కొల్లం - శ్రీకాకుళం రోడ్‌ మధ్య కొత్తగా 18 సర్వీసులు నడపనున్నారు. వీటిలో శ్రీకాకుళం రోడ్‌ - కొల్లం నడుమ డిసెంబర్‌ 1 నుంచి జనవరి 27 వరకు సర్వీసులందించే ప్రత్యేక రైలు (08553) ప్రతి సోమవారం మార్నింగ్ 6 గంటలకు శ్రీకాకుళం రోడ్‌ స్టేషన్‌లో బయల్దేరి సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు కొల్లం చేరుకుంటుంది. అలాగే, రిటర్న్ జర్నీలో 08554 రైలు ప్రతి సోమవారం కొల్లంలో సాయంత్రం 4.30గంటలకు బయల్దేరి, బుధవారం తెల్లవారుజామున 2.30 గంటలకు శ్రీకాకుళం స్టేషన్​ (ఆమదాలవలస) చేరుకోనుంది.

Sabarimala Special Trains (ETV Bharat)

తెలంగాణ రాష్ట్రం నుంచి కాచిగూడ - కొట్టాయం - కాచిగూడ మధ్య డిసెంబర్‌ 5 నుంచి 27 వరకు ప్రతి గురు, శుక్రవారాల్లో ఈ స్పెషల్​ రైళ్లు రాకపోకలు కొనసాగించనున్నాయి. కాచిగూడ - కొట్టాయం (07133) రైలు డిసెంబర్‌ 5, 12, 19, 26 తేదీల్లో (ప్రతి గురువారం) మధ్యాహ్నం 3.40 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్​లో బయల్దేరి శుక్రవారం సాయంత్రం 6.50 గంటలకు కొట్టాయం చేరుకోనుంది. డిసెంబర్‌ 6, 13, 20, 27 తేదీల్లో (ప్రతి శుక్రవారం) స్పెషల్​ ట్రైన్ (07134) రాత్రి 8.30 గంటలకు కొట్టాయంలో బయల్దేరి మరుసటి రోజు (శనివారం ) రాత్రి 11.40 గంటలకు కాచిగూడ చేరనుంది. ఇకపోతే, హైదరాబాద్‌ కొట్టాయం - సికింద్రాబాద్ ప్రత్యేక రైళ్లు డిసెంబర్‌ 3 నుంచి జనవరి 1 వరకు ప్రతి మంగళ, బుధవారాల్లో రాకపోకలు కొనసాగించనున్నాయి. హైదరాబాద్‌ - కొట్టాయం (07135) ప్రత్యేక రైలు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు బయల్దేరి మరుసటి రోజు సాయంత్రం 4.10 గంటలకు కొట్టాయం స్టేషన్​కు చేరుకోనుంది. అలాగే, కొట్టాయం - హైదరాబాద్‌ స్పెషల్ ట్రైన్ (07136) బుధవారం సాయంత్రం 6.10 గంటలకు కొట్టాయంలో స్టార్ట్​ అయి మరుసటి రోజు రాత్రి 11.45 గంటలకు హైదరాబాద్‌ చేరుకోనుంది.

శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు శుభవార్త - ఆ తేదీల్లో కాచిగూడ నుంచి 4 ప్రత్యేక రైళ్లు

అయ్యప్ప భక్తులకు డబుల్ గుడ్​న్యూస్- డౌట్స్​ క్లియర్​ చేసే AI యాప్- శబరిమలలో ఫుడ్ ఐటెమ్స్​ ధరలు ఫిక్స్!

Last Updated : Nov 26, 2024, 3:38 PM IST

ABOUT THE AUTHOR

...view details