తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఆరెంజ్ క్యాప్​ అతడే గెలుచుకుంటాడు!' - ఐపీఎల్​పై చాహల్ ప్రిడిక్షన్​ - యుజ్వేంద్ర చాహల్ ఆరెంజ్ క్యాప్

Yuzvendra Chahal Orange Cap : ఇటీవలే ఏ స్పోర్ట్స్ వెబ్​సైట్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీమ్ఇండియా స్టార్ స్పిన్నర్​ యుజ్వేంద్ర చాహల్ పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. అందులో భాగంగా ఐపీఎల్​ గురించి తన అంచనాలు తెలియజేశాడు.

Yuzvendra Chahal Orange Cap
Yuzvendra Chahal Orange Cap

By ETV Bharat Telugu Team

Published : Mar 4, 2024, 7:39 AM IST

Yuzvendra Chahal Orange Cap :అటు టీమ్ఇండియా మ్యాచ్​లతో పాటు ఐపీఎల్​లోనూ ఎన్నో అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు యుజ్వేంద్ర చాహల్​. ముఖ్యంగా ఐపీఎల్​తో తన స్పిన్ మాయాజాలం చూపించి ఎన్నో అద్వితీయ వికెట్లు తీశాడు ఈ స్టార్ స్పిన్నర్​. దీంతో ఐపీఎల్​లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.

ప్రస్తుతం ఐపీఎల్ సన్నాహకాల్లో బిజీగా ఉన్న చాహల్​, ఇటీవల ఓ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు పలు ఆస్తికరమైన విషయాలు పంచుకున్నాడు. అంతే కాకుండా అతడు రానున్న ఐపీఎల్ 2024 అంచనాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశాడు.

ఈ సారి ఆరెంజ్ క్యాప్ ఎవరి సొంతమవుతుందని యాంకర్ అడిగాడు దానికి అతడిచ్చిన రిప్లై ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది." విరాట్ కోహ్లీ, శుభ్‌మాన్ గిల్ కాదు ఈ సారి టీమ్​ఇండియా యంగ్ ప్లేయర్​, రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్‌ ఆరెంజ్ క్యాప్ విజేతగా నిలుస్తాడు. లేకుంటే జోస్ బట్లర్​కు కూడా ఈ సారి ఛాన్సెస్​ ఉన్నాయి" అని చాహల్ అంచనా వేశాడు.

2022 సీజన్‌లో జోస్ బట్లర్ ఆరెంజ్ క్యాప్‌ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఆ ఏడాది ఆడిన 17 మ్యాచ్‌ల్లో జోస్​ 863 పరుగులు సాధించాడు. మరోవైపు జైస్వాల్ కూడా మంచి ఫామ్​లో ఉన్నాడు. ఆడిన అన్ని ఫార్మాట్లలోనూ సత్తా చాటుతాడు. గత ఐపీఎల్ సీజన్‌లోనూ తన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఆడిన 14 మ్యాచ్‌లలో 624 పరుగులు స్కోర్ చేశాడు. అలా ఒక్క ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించిన అన్‌క్యాప్​డ్​ బ్యాటర్‌గానూ చరిత్రకెక్కాడు. ఇక పర్పుల్ క్యాప్​ను ఆఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ గెలుచుకుంటాడంటూ ప్రిడిక్ట్ చేశాడు. గతేడాది జరిగిన లీగ్​లో 17 మ్యాచ్‌లలో 27 వికెట్లు సాధించి సత్తా చాటాడు.

IPL 2024 Schedule : 2024 ఐపీఎల్ షెడ్యూల్ విడుదలైంది. మార్చి 22న లీగ్ ప్రారంభంకానుంది. చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు మధ్య చెన్నై చెపాక్ స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. సాధారణ ఎన్నికల నేపథ్యంలో బోర్డు తొలుత 21 మ్యాచ్​ల షెడ్యూల్​ను ప్రకటించింది. మార్చి 22 నుంచి ఏప్రిల్ 7వరకు ఐపీఎల్ 17న సీజన్ తొలి విడత టోర్నీ జరగనుంది. ఇందులో నాలుగు డబుల్ హెడర్ మ్యాచ్​లు ఉన్నాయి. ఇక మిగిలిన మ్యాచ్​ల షెడ్యూల్ సాధారణ ఎన్నికల తేదీలు ఖరారైన తర్వాత ప్రకటించే ఛాన్స్ ఉంది.

అయితే భారత్​లో ఏప్రిల్- మే నెలలో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంది. అయినప్పటికీ ఈసారి టోర్నమెంట్​ను పూర్తిగా భారత్​లోనే నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నట్లు ఐపీఎల్ లీగ్‌ ఛైర్మన్‌ అరుణ్ ధుమాల్‌ ఇదివరకే స్పష్టం చేశారు. ఇక ఈ ఎడిషన్​లో ప్లేఆఫ్స్ కలుపుకొని మొత్తం 74 మ్యాచ్​లు జరగనున్నాయి

'అప్పటికి చాహల్ ఎవరో నాకు తెలీదు- ఆ ఒక్క మాటతో నచ్చేశాడు'- ధనశ్రీ లవ్​ కహానీ!

Yuzvendra Chahal Australia Series 2023 : ' జట్టులో ఉండాల్సిన వాడు.. అలా ఎందుకు చేశారో అర్థం కావట్లేదు'

ABOUT THE AUTHOR

...view details