Newzealand VS Srilanka Test Series : న్యూజిలాండ్‌తో శ్రీలంక టెస్ట్ సిరీస్ ఆడనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను శ్రీలంక క్రికెట్(ఎస్‌ఎల్‌సీ) రీసెంట్గా రిలీజ్ చేసింది. అయితే ఈ షెడ్యూల్‌లో భాగంగా 'రెస్ట్ డే' ఉంటుందని ప్రకటించింది. దీంతో చాలా మంది ఈ తరం క్రికెట్ అభిమానులు ఈ 'రెస్ట్ డే' ఎందుకిచ్చారు? కొత్తగా దీనిని చేర్చారా? అసలు ఎంటి ఇది? అని చర్చిస్తున్నారు.
అసలేంటీ 'రెస్ట్ డే'?(What is Rest Day) - శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికల కారణంగా ఈ 'రెస్ట్ డే'ను జత చేశారు. వాస్తవానికి ఈ రెస్ట్ డే అనేది క్రికెట్లో పాత సంప్రదాయామే. అప్పటి క్రికెట్ అభిమానులకు ఈ రెస్ట్ డే గురించి తెలిసే ఉంటుంది. టెస్టు మ్యాచులో తీసుకునే విరామంనే రెస్ట్ డే అంటారు.
అప్పట్లో ఇంగ్లాండ్‌లో జరిగే మ్యాచ్‌లకు ఈ రెస్ట్ డేలు సాధారణంగానే ఉండేది. ఎందుకంటే ఆ రోజుల్లో టెస్ట్ మ్యాచులు వరుసగా ఆరు రోజుల పాటు సాగేవి. అప్పుడు ఆదివారం ఒక రోజు సెలవుగా తీసుకునేవారు. ఇది ఆటగాళ్లకు గేమ్ నుంచి కాస్త రిలీఫ్ ఇచ్చేది. బౌన్స్, పేస్ పొందేందుకు పిచ్‌కు అనుకూలంగా ఉండేది. అయితే ఆ తర్వాత క్రమంగా ఇంటర్నేషనల్ క్రికెట్‌కు క్రేజ్, డిమాండ్ పెరగడం, అలానే జట్లు తమ ఆట సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనతో రెస్ట్ డేను క్రమక్రమంగా తొలగించేశారు. అలా ఈ రెస్ట్ డే సంప్రదాయం కాలంతో పాటు కనుమరుగై పోయింది.