Virat Kohli Injury :టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కోహ్లీ మెడ నరం పట్టేసిందని వార్తలు వస్తున్నాయి. దీని కోసం విరాట్ ఇంజెక్షన్ కూడా తీసుకున్నాడని తెలుస్తోంది. అయితే కోహ్లీ గాయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కానీ, ఇది నిజమైతే మాత్రం అతడు రంజీ ట్రోఫీలో ఆడడం అనుమానమే!
మరోవైపు రంజీ ట్రోఫీ గ్రూప్ స్టేజ్‌లోని రెండు మ్యాచ్‌లకు దిల్లీ క్రికెట్ అసోసియేషన్ తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టులో రిషభ్ పంత్‌తోపాటు, విరాట్‌కు చోటు దక్కింది. కానీ, మెడ నొప్పి కారణంగా విరాట్ బరిలో దిగడం కష్టమేనని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే విరాట్ బరిలో దిగగపోయినా, దిల్లీ జట్టుతో కలిసి ఉంటాడని సమాచారం. ఇక ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు విరాట్ గాయపడడం అభిమానులను కలవర పెడుతోంది.