తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఎల్గర్xవిరాట్ ఫైట్- క్రికెటర్​​పై ఉమ్మేసిన కోహ్లీ!- తర్వాత ఏమైందంటే?

Virat Elgar Fight: విరాట్ కోహ్లీ ఓ మ్యాచ్​లో తనపై ఉమ్మివేశాడని సౌతాఫ్రికా మాజీ కెప్టెన్​ డీన్ ఎల్గర్​ అన్నాడు. తర్వాత డివిలియర్స్ జోక్యంతో సారీ చెప్పినట్లు ఓ పాడ్​కాస్ట్​ ప్రోగ్రామ్​లో ఎల్గర్ పేర్కొన్నాడు.

Virat Elgar Fight
Virat Elgar Fight

By ETV Bharat Telugu Team

Published : Jan 30, 2024, 11:32 AM IST

Updated : Jan 30, 2024, 1:21 PM IST

Virat Elgar Fight:టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై సౌతాఫ్రితా మాజీ కెప్టెన్ డీన్ ఎల్గర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఓ టెస్టు మ్యాచ్​లో విరాట్ తనపై ఉమ్మివేశాడని ఎల్గర్ ఆరోపించాడు. రెండేళ్ల తర్వాత ఐపీఎల్​ టీమ్​మేట్ ఏబీ డివిలియర్స్ జోక్యంతో విరాట్ తనకు సారీ చెప్పాడని అన్నాడు. రీసెంట్​గా క్రిస్ మోరిస్​తో కలిసి 'బాంటర్ విత్ ది బాయ్స్​' (Banter with The Boys) అనే పాడ్​కాస్ట్​ షో లో పాల్గొన్న ఎల్గర్ ఈ విషయాన్ని చెప్పాడు.

'2015లో భారత్ పర్యటనకు వెళ్లాను. అక్కడ ఓ టెస్టు మ్యాచ్​లో నేను బ్యాటింగ్ చేస్తుండగా అశ్విన్, జడేజా నాపై స్లెడ్జింగ్​కు పాల్పడ్డారు. నేను కూడా వారికి స్ట్రాంగ్​గా రిప్లై ఇచ్చా. అప్పడే విరాట్ మధ్యలో వచ్చి నాపై ఉమ్మివేశాడు. కోపంతో నేను విరాట్​ను తిట్టాను. ఆ బూతు పదం విరాట్​కు అర్థం కాలేదు. డివిలియర్స్​ హెల్ప్​తో దానికి అర్థం తెలుసుకున్న విరాట్, మళ్లీ అదే బూతును నాపై వాడాడు. ఇక భారత్​లో ఆడుతున్నాం కదా అని నేను లైట్​ తీసుకున్నా. రెండు సంవత్సరాల తర్వాత భారత్, సౌతాఫ్రికా టూర్​కు వచ్చింది. అప్పుడు విరాట్ మనం కలుద్దామా? అని అడిగాడు. నేనూ ఓకే అని చెప్పా. మేం తెల్లవారుజాము 3 గంటల వరకు పార్టీ చేసుకున్నాం. అప్పుడు విరాట్ నాకు సారీ చెప్పాడు' అని ఎల్గర్ చెప్పాడు.

Dean Elgar Career: డీన్ ఎల్గర్ 2012లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. కెరీర్​లో ఎక్కువ మొత్తం టెస్టు మ్యాచ్​లే ఆడిన ఎల్గర్, టీ20ల్లో ఎంట్రీ ఇవ్వలేదు. ఇక 16 టెస్టు మ్యాచ్​ల్లో 37.64 సగటుతో ఎల్గర్ 5347 పరుగులు చేశాడు. అందులో 14 సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. అటు బౌలింగ్​లోనూ 15 వికెట్లు పడగొట్టాడు. కాగా, రీసెంట్​గా టీమ్ఇండియాతో ముగిసిన సిరీస్​తో ఎల్గర్ కెరీర్​కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక తన కెరీర్​ ఆఖరి మ్యాచ్​లో ఎల్గర్​ క్యాచ్ కోహ్లీయో పట్టడం గమనార్హం.

దక్షిణాఫ్రికా టూర్​లో బయటపడ్డ టీమ్​ఇండియా బలహీనతలు!- ఆ కల నెరవేరేదెప్పుడో?

బూమ్ బూమ్ 'బుమ్రా'- సౌతాఫ్రికా ఆలౌట్​- భారత్‌ టార్గెట్ 79

Last Updated : Jan 30, 2024, 1:21 PM IST

ABOUT THE AUTHOR

...view details