Champions Trophy Team India : 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరం అవ్వడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. పలువురు మాజీలు కూడా బుమ్రా లేకపోతే భారత్ కష్టపడాల్సి వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. బుమ్రా లేకపోయినా కూడా టీమ్ఇండియా మ్యాచ్ ఆడడం నేర్చుకోవాలని అన్నాడు.
'ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటికీ టీమ్ఇండియానే ఫేవరెట్ అని నమ్ముతున్నాను. బుమ్రా అత్యుత్తమ బౌలర్లలో ఒకడు. మ్యాచ్‌ను గెలిపించగల సత్తా అతడికి ఉంది. అయితే బుమ్రా లేకపోయినా, జట్టులో జడేజా, షమీ, అర్షదీప్, కుల్దీప్‌లాంటి అనుభవజ్ఞులు ఉన్నారు. టీమ్ఇండియా ఫేవరెటే, అందుకే ఫేవరెట్లాగే మాదిరిగానే ఆడాల్సి ఉంటుంది. మనం టోర్నీ గెలవాలని అనుకుంటే, బుమ్రా లేకపోయినా సరే మ్యాచ్ ఆడడం నేర్చుకోవాలి' అని హర్భజన్ తన యూట్యూబ్ ఛానెల్ చిట్‌చాట్‌లో అభిప్రాయపడ్డాడు.
అందుకే మనం ఫేవరెట్
'భారత్ జట్టు సామర్థ్యం చూసి తర్వాతే టీమ్ఇండియా ఫేవరెట్ అని అంటున్నా. రోహిత్, విరాట్ ఫామ్‌లోకి వచ్చారు. శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ నిలకడగా పరుగులు సాధిస్తున్నారు. ఓవరాల్‌గా బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో మనోళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. అయితే డెత్ ఓవర్లలో ప్రత్యర్థి జట్లకు స్వల్ప పరుగులు అవసరమైనప్పుడు మాత్రం బుమ్రా గుర్తొస్తాడు' అని భజ్జీ పేర్కొన్నాడు.
ఆసీస్ టూర్లో గాయం
గతనెల ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీలో జరిగిన చివరి టెస్ట్ సందర్భంగా బుమ్రాకు వెన్నునొప్పి వచ్చింది. ఆ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయలేదు. అప్పటి నుంచి బుమ్రా ఆటకు దూరంగా ఉన్నాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. ప్రస్తుతం అతడి మెడికల్ రిపోర్ట్ బాగానే ఉన్నా, రిస్క్ తీసుకోవడం ఇష్టం లేని సెలక్షన్ టీమ్ బుమ్రాకు రెస్ట్ ఇచ్చింది.
ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మమ్మద్. షమీ, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్త్
A look at #TeamIndia's updated squad for ICC Champions Trophy 2025 🙌#ChampionsTrophy pic.twitter.com/FchaclveBL
— BCCI (@BCCI) February 12, 2025
బుమ్రాపై భారీ ఆశలు పెట్టుకున్నాం, కానీ: గౌతమ్ గంభీర్
బుమ్రా మెడికల్ రిపోర్ట్ ఓకే- కానీ, ఛాంపియన్స్ ట్రోఫీకి తీసుకోలేదు- ఎందుకంటే?