తెలంగాణ

telangana

ETV Bharat / sports

'త్వరలోనే డాక్టర్ వెంకటేశ్​ అయ్యర్​ను ఇంటర్వ్యూ చేస్తారు'! చదువుపై ఫుల్​ ఫోకస్ పెట్టిన KKR స్టార్! - VENKATESH IYER PHD

డాక్టరేట్ చేస్తున్న కోల్​కతా స్టార్ ప్లేయర్ - ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడి

Venkatesh Iyer PHD
Venkatesh Iyer (IANS Photo)

By ETV Bharat Sports Team

Published : Dec 9, 2024, 4:03 PM IST

Updated : Dec 9, 2024, 4:23 PM IST

Venkatesh Iyer PHD : క్రికెట్​లోనే కాకుండా చదువులోనూ రాణిస్తానంటున్నాడు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ స్టార్ ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్. 2018లో ఫైనాన్స్‌లో ఎంబీఏ పూర్తి చేసిన అయ్యర్, త్వరలో పీహెచ్​డీ సాధించి డాక్టర్​ వెంకటేశ్ అయ్యర్​గా మారనున్నట్లు తెలిపాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అయ్యర్, తన స్టడీస్​తో పాటు క్రికెట్​ గురించి పలు విషయాలను పంచుకున్నాడు.

"క్రికెటర్లు కేవలం క్రికెట్ పరిజ్ఞానానికే పరిమితం కాకుండా సాధారణ పరిజ్ఞానాన్ని సంపాదించడం కోసం చదువుకోవాలని నేను అనుకుంటున్నాను. కనీసం ఓ గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్-గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలనేది నా అభిప్రాయం. ఇప్పుడు నేను నా పీహెచ్‌డీ (ఫైనాన్స్) చేస్తున్నాను. నెక్ట్స్‌ టైమ్‌ మీరు డాక్టర్ వెంకటేశ్ అయ్యర్‌ని ఇంటర్వ్యూ చేస్తారు. నేను ఓ సంప్రదాయక కుటుంబం నుంచి వచ్చాను. అందుకే క్రికెట్‌పై మాత్రమే ఫోకస్‌ పెడతామంటే మా మధ్యతరగతి తల్లిదండ్రులు ఒప్పుకోవడం చాలా కష్టం. కానీ, నా పరిస్థితి ఇందుకు భిన్నం. నేను బాగా చదువుతాను. నేను క్రికెట్‌లో బాగా రాణించాలని నా తల్లిదండ్రులు కోరుకున్నారు. ఎవరైనా కొత్త వ్యక్తి మధ్యప్రదేశ్ జట్టులోకి వస్తే నేను ముందు అడిగే ప్రశ్న చదువుతున్నావా లేదా? అని. ఒక క్రికెటర్ 60 సంవత్సరాల వరకు ఆడలేడు. అయితే విద్య మాత్రం మనం చనిపోయేంతవరకూ అది మనతోనే ఉంటుంది. జీవితంలో నిజంగా రాణించాలనుకుంటే ఎవ్వరైనా సరే చదువుకోవాలి. బాగా చదువుకుంటే ఆటలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. నేను ఎప్పుడూ ఆట గురించి ఆలోచించడానికి ఇష్టపడను. ఎందుకంటే అది నాకు స్ట్రెస్​ను కలిగిస్తుంది. ఒకేసారి రెండు పనులు చేయగలిగే అవకాశం ఉంటే నేను దాన్ని తప్పకుండా చేస్తాను. నేను మైదానంలో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి నా చదువు నాకు ఎంతో సహాయపడుతుంది. జీవితంలోనూ సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ విద్య ఎంతో ఉపయోగపడుతుంది" అని వెంకటేశ్ అయ్యర్ పేర్కొన్నాడు.

ఇక ఎంబీఏ తర్వాత బెంగళూరులోని అయ్యర్​కు ఓ ప్రముఖ కంపెనీ నుంచి ఆఫర్​ వచ్చింది. కానీ ఉద్యోగం చేస్తూ తనకిష్టమైన క్రికెట్‌పై ఫుల్​ ఫోకస్ పెట్టలేడని భావించి దాన్ని రిజెక్ట్ చేశాడట. ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో వెంకటేశ్ అయ్యర్‌ను కోల్​కతా నైట్​రైడర్స్ ఫ్రాంచైజీ రూ.23.75 కోట్లకు సొంతం చేసుకుంది. దీంతో ఈ మెగా వేలంలో అత్యథిక ధర పలికిన ప్లేయర్​గానూ అయ్యర్ రికార్డుకెక్కాడు.

రూ.23 కోట్ల ప్లేయర్ కాదు, రూ.1.5 కోట్ల ప్లేయరే ఆ జట్టుకు సారథి!

IPL రికార్డులు బద్దలుగొట్టిన రిషభ్ పంత్ - రూ.27కోట్లకు లఖ్​నవూ సొంతం- రెండో కాస్ట్లీ ప్లేయర్​గా శ్రేయస్ అయ్యర్

Last Updated : Dec 9, 2024, 4:23 PM IST

ABOUT THE AUTHOR

...view details