తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్‌ 2025 వేలంలో అన్‌సోల్డ్‌ - ఇప్పుడేమో టీ20 క్రికెట్‌లో ప్రపంచ రికార్డ్​ - URVIL PATEL ANOTHER CENTURY

అదరగొడుతోన్న ఓపెనర్ ఉర్విల్ పటేల్ - ఆరు రోజులో వ్యవధిలో మరో సెంచరీ.

Syed Mushtaq Ali Trophy 2024 Urvil Patel 2nd Century
Syed Mushtaq Ali Trophy 2024 Urvil Patel 2nd Century (source (Gujrat Cricket X Handle))

By ETV Bharat Sports Team

Published : Dec 3, 2024, 4:19 PM IST

Syed Mushtaq Ali Trophy 2024 Urvil Patel 2nd Century : సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో గుజరాత్ ఓపెనర్ ఉర్విల్ పటేల్ అదరగొడుతున్నాడు. ఆరు రోజుల వ్యవధిలోనే రెండో శతకాన్ని కూడా బాదేశాడు. దీంతో ప్రస్తుతం క్రికెట్​లో అతడి పేరు మార్మోగిపోతోంది.

తాజాగా మంగళవారం ఉత్తరాఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఉర్విల్ పటేల్ 36 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 41 బంతుల్లోనే 115 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 8 ఫోర్లు, 11 సిక్స్‌లతో ఈ 26 ఏళ్ల బ్యాటర్ ప్రత్యర్థి జట్టు బౌలర్లను బెంబేలెత్తించాడు.

దీంతో 183 పరుగుల లక్ష్యాన్ని 13.1 ఓవర్లలోనే ఛేదించేసింది గుజరాత్ జట్టు. ఈ శతకం ద్వారా ఉర్విల్ పటేల్ ఓ ప్రపంచ రికార్డును కూడా క్రియేట్ చేశాడు. టీ20 క్రికెట్‌లో 40 బంతులలోనే రెండు శతకాలు బాదిన తొలి ప్లేయర్​గా వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు.

ఇకపోతే ఉర్విల్ గత వారం త్రిపుర జట్టుపై ఓ సెంచరీ బాదిన సంగతి తెలిసిందే. కేవలం 28 బంతుల్లోనే శతకం బాదాడు. ఈ క్రమంలోనే టీ 20 క్రికెట్‌లో ఫాస్టెస్ట్​ సెంచరీ చేసిన రెండో ప్లేయర్​గా నిలిచాడు. దీంతో భారత్‌ తరఫున టీ20ల్లో వేగవంతమైన శతకం బాదిన రికార్డు ఇప్పుడు ఉర్విల్ పటేల్ పేరిట నిలిచింది.

రీసెంట్​గా జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో ఉర్విల్ అన్‌సోల్డ్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. కనీస ధర రూ.30 లక్షలతో వేలం బరిలో దిగాడు. కానీ ఈ క్రికెటర్‌ను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంఛైజీ కూడా ఆసక్తి చూపలేదు. గతంలో ఉర్విల్ పటేల్‌ ఐపీఎల్ 2023 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌ జట్టులో ఉన్నాడు. కనీస ధర రూ.20 లక్షలకు అతడిని దక్కించుకుంది. అయితే అతడికి ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం దక్కలేదు.

కాగా, 2024 సయ్యద్ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో ఇప్పటి వరకు ఉర్విల్ 5 మ్యాచ్‌లు ఆడాడు. 94 సగటుతో 295 పరుగులు ఖాతాలో వేసుకున్నాడు. ఈ సీజన్‌లో ఏకంగా 25 సిక్స్‌లు బాది అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెటర్ ఇతడు - 70 వేల కోట్ల ఆస్తి! - 22 ఏళ్లకే రిటైర్మెంట్!

పెళ్లి పీటలెక్కనున్న స్టార్ షట్లర్ - రాజస్థాన్​లో పీవీ సింధు వివాహం

ABOUT THE AUTHOR

...view details