Mohd Amir Pushpa Celebration : ప్రస్తుతం దేశవ్యాప్తంగా 'పుష్ప 2' మేనియా నడుస్తోంది. సినిమాలో 'తగ్గేదేలే' మేనరిజానికి దేశవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ వచ్చింది. తాజాగా బార్డర్లు దాటి పాకిస్థాన్‌కు పుష్ప మేనియా పాకింది. వికెట్ తీసిన అనంతరం 'తగ్గేదేలే' అంటూ మేనరిజం ప్రదర్శిస్తూ పాక్ ఆటగాడు మహ్మద్ ఆమిర్ సంబరాలు చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ మేనరిజాన్ని సినీ సెలబ్రిటీలే కాకుండా టీమ్ఇండియా క్రికెటర్లు సైతం మైదానంలో ప్రదర్శించారు. గతంలో రవీంద్ర జడేజా, డేవిడ్ వార్నర్, రీసెంట్గా ఆసీస్ పర్యటనలో నితీశ్ కుమార్ రెడ్డి సైతం 'తగ్గేదేలే' మేనరిజం ప్రదర్శించారు. తాజాగా ఈ మేనరిజం ఇంటర్నేషనల్ బార్డర్ దాటేసింది. ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో వికెట్ పడగొట్టిన అనంతరం పాకిస్థాన్ పేసర్ మహ్మద్ ఆమిర్ తన సంతోషాన్ని తగ్గేదేలే మేనరిజంలో సెలబ్రేట్ చేసుకున్నాడు.
AMIR BREATHING FIRE! 🔥
— International League T20 (@ILT20Official) January 22, 2025
That first spell from Mohammad Amir was literally WOW 🤩 getting rid of three in-form batters in absolutely no time! Sharjah Warriorz find themselves playing catch-up already.
🔝 start by the Vipers! 🔥#DVvSW #DPWorldILT20 #AllInForCricket pic.twitter.com/htrZckRgpe
డెసర్ట్ వైపర్స్ x షార్జా మ్యాచ్
ఇంటర్నేషల్ లీగ్ టీ20లో భాగంగా జనవరి 22న దుబాయ్ వేదికగా డెసర్ట్ వైపర్స్ వర్సెస్ షార్జా వారియర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. డెసర్ట్ వైపర్స్ కెప్టెన్ లాకీ ఫెర్గూసన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో మొదటి ఓవర్ ను మహ్మద్ ఆమిర్ వేశాడు. తొలి ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో వికెట్ తీసిన ఆనందంలో తగ్గేదేలే మేనరిజాన్ని ప్రదర్శిస్తూ సంబరాలు చేసుకున్నాడు ఆమిర్ . ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పుష్ప మేనియా పాకిస్థాన్‌కు కూడా చేరిందని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన షార్జా వారియర్స్ 19.1 ఓవర్లలో 91 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టు బ్యాటరల్లో జేసన్ రాయ్ (30 పరుగులు) మినహా ఎవరూ రాణించలేదు. డెసర్ట్ వైపర్స్ బౌలర్లలో మహ్మద్ అమీర్ 4, హసరంగ 3, సామ్ కర్రన్ 2 వికెట్లు పడగొట్టారు.
లక్ష్యాన్ని ఊదేసిన ఓపెనర్లు
92 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన డెసర్ట్ వైపర్స్ వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని ఊదేసింది. ఫకర్ జమాన్(71* పరుగులు), అలెక్స్ హేల్స్ (23* పరుగులు) రాణించడంతో 10 వికెట్ల తేడాతో డెసర్ట్ వైపర్స్ జట్టు గెలుపొందింది. కాగా, ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసిని అమీర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
6ఏళ్ల తర్వాత కెప్టెన్‌గా ఎంపికైన వార్నర్- ఇక డేవిడ్ భాయ్ 'తగ్గేదేలే'
నితీశ్ ది సేవియర్- ఫాలో ఆన్ తప్పించిన తెలుగోడు- పుష్ప స్టైల్లో సెలబ్రేషన్స్