Unluckiest Run Out In Cricket :క్రికెట్ చరిత్రలోనే ఓ బ్యాటర్ విచిత్రమైన విధంగా రనౌట్ అయ్యాడు. ఇందులో ఏ మాత్రం తన పొరపాటు లేనప్పటికీ బ్యాటర్ పెవిలియన్ చేరాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 'ఇలా కూడా ఔట్ అవుతారా?', 'బ్యాడ్‌లక్' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతునున్నారు. మరి ఈ విచిత్రమైన ఈ రనౌట్ మీరూ చూసేయండి!
ఇదీ జరిగింది
ఇంగ్లాండ్- సౌతాఫ్రికా అండర్- 19 జట్లు అనధికార టెస్టు మ్యాచ్‌లో తలపడ్డాయి. మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ 30.4 ఓవర్ వద్ద ఇంగ్లాండ్ బ్యాటర్ ఆర్యన్ సావంత్ క్రీజ్‌లో ఉన్నాడు. అతడు సౌతాఫ్రికా బౌలర్ జాన్ రోల్స్ వేసిన బంతిని స్వీప్ షాట్ ఆడాడు. అయితే షార్ట్ లెగ్‌లో ఉన్న ఫీల్డర్ జోరిచ్ వాన్ హెల్మెట్‌ను తాకిన బంతి మళ్లీ స్టంప్స్ వైపునకు రిటర్న్ వచ్చి, బెయిల్స్‌ను పడగొట్టింది. అప్పటికే షాట్ ఆడిన సావంత్ క్రీజ్ బయట ఉన్నాడు.