Paris Olympics Shooting 2024:ఒలింపిక్స్ షూటింగ్ ఈవెంట్లో పాల్గొనే షూటర్లు ప్రత్యేకమైన ఎక్విప్మెంట్ ధరిస్తారు. టార్గెట్ మిస్ అవ్వకుండా ఉండేందుకు కళ్లకు లెన్స్ (Eye Lens) అండ్ ఇయర్ ప్రొటెక్టర్స్ (Ear Protectors)తో ఈవెంట్లో పాల్గొని ఫలితాలు సాధిస్తారు. అయితే పారిస్ ఒలింపిక్స్‌లో ఓ షూటర్ ఇవేమీ వాడకుండానే ఈవెంట్లో పాల్గొని సిల్వర్ మెడల్ సాధించాడు. అది కూడా 51ఏళ్ల వయసులో. అతడు సింపుల్‌గా ఈవెంట్లో పాల్గొన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తుర్కియేకు చెందిన 51ఏళ్ల యూసుఫ్ డికేస్ పారిస్ ఒలింపిక్స్ 10మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ మిక్స్‌డ్ ఫైనల్‌కు చేరుకున్నాడు. ఈ ఈవెంట్లో యూసుఫ్ ఎలాంటి ఎక్విప్మెంట్ ధరించకుండా సింపుల్‌గా కనిపించాడు. అతడు తన రెగ్యులర్ కళ్లజోడు (Spects)తో పాకెట్లో చేయి ఉంచి అలవోకగా పిస్టల్ పేల్చాడు. కాగా, యూసుఫ్- తర్హాన్ జోడీ ఈ ఈవెంట్లో రెండో స్థానం దక్కించుకొని సిల్వర్ మెడల్ అందుకుంది. ఇక 51ఏళ్ల వయసులో ఎలాంటి ఎక్విప్మెంట్ సహాయం లేకుండా సిల్వర్ నెగ్గిన యూసుఫ్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. 'కేవలం కళ్లజోడుతోనే సిల్వర్ పట్టేశాడు', 'ఈ ఒలింపిక్స్‌కు తుర్కియే హిట్‌మ్యాన్‌ను పంపినట్లుంది', 'గన్ ఫర్ ఫన్' అంటూ నెటిజన్లు యూసుఫ్‌ను అభినందిస్తున్నారు. అయితే జులై 30న ఈ పోటీ జరగ్గా, తాజాగా వీడియో వైరల్ అవుతోంది.
కాగా, ఈ ఈవెంట్లో సెర్బియా జోడీ జొరానా- దామిర్ అగ్రస్థానం దక్కించుకొని గోల్డ్ మెడల్ అందుకుంది. ఇక భారత్ షూటర్లు మను బాకర్- సరబ్జోత్ సింగ్ కాంస్య పతకం ముద్దాడిన ఈవెంట్ కూడా ఇదే.