Top 5 Shoes For Fast Bowlers : క్రికెట్లో స్పిన్ బౌలర్లతో పోలిస్తే పేసర్లకు ఎక్కువ శ్రమ ఉంటుంది. ఎందుకంటే 140-150కి.మీ వేగంతో బంతిని విసరాల్సి ఉంటుంది. అందుకు వికెట్ల వెనుక నుంచి స్పీడ్ గా పరుగెత్తుకుని రావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వారి కాళ్లకు ఉన్న షూస్ చాలా ముఖ్యం. ఎందుకంటే బౌలర్లు వేగంగా బాల్ వేసేటప్పుడు వాళ్ల కాళ్లకు పట్టును ఇస్తాయి ఆ షూస్.
అలాగే మైదానంలో బౌలర్ల పనితీరును మెరుగుపరచడంలోనూ ఇవి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. షూస్ కంఫర్ట్‌గా లేకపోతే అనుకున్న రీతిలో పేసర్లు బాల్ వేయలేరు. అందుకే ఫాస్ట్ బౌలర్లు తాము ధరించే షూ విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉంటారు. ఈ క్రమంలో మార్గెట్ వర్గాల ప్రకారం ఈ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉండే 5రకాల షూస్ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అడిడాస్ అడిపవర్ వెక్టర్ 20
అడిడాస్ అడిపవర్ వెక్టర్ 20 ప్రత్యేకంగా ఫాస్ట్ బౌలర్ల కోసం రూపొందించినవి ఈ షూస్. ఈ డిజైన్ పేసర్లకు అనుకూలంగా, తేలికగా ఉంటుంది. బౌలర్లకు కంఫర్ట్‌గా అనిపిస్తాయని, అలాగే అడిడాస్ షూస్ కాళ్లకు పట్టునిస్తాయి. అలాగే వేగంగా పరుగెత్తడానికి సహాయపడుతాయని తెలుస్తోంది. బౌలర్ల పనితీరును మెరుగుపరచడంలోనూ ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.
న్యూ బ్యాలెన్స్ CK4030 L4 2E స్పైక్
న్యూ బ్యాలెన్స్ షూస్‌ను బౌలర్లు విరివిగా ఉపయోగిస్తుంటారు. ఇవి వారి పాదాలకు కంఫర్ట్‌గా అనిపిస్తాయి. ఈ షూస్ డిజైన్ బాగుంటుంది. పేసర్లకు న్యూ బ్యాలెన్స్ షూస్ కూడా ఒక మంచి ఆప్షన్ అవుతాయి.