Nigeria Vs New Zealand 2025 : క్రికెట్లో హిస్టరీలో సంచలన విజయం నమోదైంది. వరల్డ్ క్రికెట్లో అత్యంత పటిష్ఠమైన న్యూజిలాండ్ జట్టును పసికూన నైజీరియా ఓడించింది. 2025 మహిళల అండర్-19 వరల్డ్‌కప్‌లో భాగంగా తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నైజీరియా అమ్మాయిల జట్టు 2 పరుగుల స్వల్ప తేడాతో నెగ్గి చరిత్ర సృష్టించింది. దీంతో నైజీరియా అమ్మాయిల ఆనందానికి అవుధుల్లేకుండా పోయాయి. సంతోషంతో కేరింతలు కొడుతూ మైదానం అంతటా తిరిగి సంబరాలు చేసుకున్నారు.
మలేసియా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో సోమవారం న్యూజిలాండ్- నైజీరియా జట్లు తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం తీవ్ర అంతరాయం కలిగించింది. దీంతో 20 ఓవర్లు సాగాల్సిన ఆటను నిర్వాహకులు ఇరువైపులా 13 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన నైజీరియా మహిళల జట్టు 13 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 65 పరుగులు చేసింది.
అనంతరం స్వల్ప లక్ష్య చేధనకు దిగిన న్యూజిలాండ్ 13ఓవర్లు ఆడి 63-6 స్కోర్‌కే పరిమితమైంది. అయితే చివరి 6 బంతుల్లో కివీస్ విజయానికి 9 పరుగులు అవసరమయ్యాయి. ఆ సమయంలో లిలియన్ ఉదేహా బంతి అందుకుంది. ఆఖరి ఓవర్ అద్భుతంగా బౌలింగ్ చేసి తన జట్టుకు చరిత్రాత్మక విజయం అందించింది. కాగా, అండర్- 19 టీ20 వరల్డ్‌కప్ హిస్టరీలో నైజీరియా జట్టుకు ఇదే తొలి విజయం కావడం విశేషం.
Nigeria are jubilant after stunning New Zealand in the 2025 #U19WorldCup 👊 pic.twitter.com/y6Mnifkekg
— ICC (@ICC) January 20, 2025