Sprouts Poha Recipe in Telugu: మీరు సింపుల్‌గా, ఫాస్ట్‌గా అయిపోయే హెల్దీ టిఫిన్ కోసం చూస్తున్నారా? అయితే స్ప్రౌట్స్ పొహా మీకు బెస్ట్ ఆప్షన్. అనేక ప్రోటీన్స్, పోషకాలు నిండిన మొలకలు తినడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ, ఈ తీరులో చేసుకుంటే మాత్రం అలాంటి వారు సైతం ఎంతో ఇష్టంగా తింటారని చెబుతున్నారు. ముఖ్యంగా డైట్ పాటించే వారు, బ్యాచిలర్స్ దీనిని చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఇందులోకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్ధాలు
- ఒకటిన్నర కప్పుల అటుకులు
- 3 టేబుల్ స్పూన్ల నూనె
- 3 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుండ్లు
- ఒక టీ స్పూన్ ఆవాలు
- ఒక టీ స్పూన్ జీలకర్ర
- 2 ఎండు మిరపకాయలు
- 2 కరివేపాకు రెబ్బలు
- పావు కప్పు ఉల్లిపాయ తరుగు
- 2 పచ్చిమిర్చి (సన్నని తరుగు)
- పావు కప్పు క్యారట్ తరుగు
- పావు కప్పు కాప్సికం తరుగు
- పావు కప్పు టమాటా సన్నని తరుగు
- రుచికి సరిపడా ఉప్పు
- పావు టీ స్పూన్ పసుపు
- పావు కప్పు ఫ్రోజెన్ బఠాణీ
- అర కప్పు మొలకలు
- పావు టీ స్పూన్ పంచదార
- 4 టేబుల్ స్పూన్ల నీళ్లు
- కొద్దిగా కొత్తిమీర
- ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం
తయారీ విధానం
- ముందుగా అటుకులని జల్లించకుని నీళ్లతో తడిపి జల్లెడలో వదిలేయండి.
- ఆ తర్వాత స్టౌ ఆన్ చేసి నూనె వేడి చేసి అందులో వేరుశనగ, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి కాసేపు వేగనివ్వాలి.
- కాసేపు వేగిన తర్వాత అందులోనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు వేసి వేయించుకోవాలి.
- ఉల్లిపాయలు ఎర్రగా మారిన తర్వాత అందులో క్యారట్, కాప్సికం ముక్కలు వేసి 3 నిమిషాలు మగ్గనివ్వాలి.
- ఆ తర్వాత బఠాణీ, మొలకలు, టమాటా ముక్కలు, ఉప్పు, పసుపు వేసి కలిపి మూతపెట్టి మరో 3 నిమిషాలు ఉడికించుకోవాలి.
- ఇప్పుడు క్లీన్ చేసుకున్న తడుపిన అటుకులు వేసి చిదిరిపోకుండా బాగా కలపాలి.
- ఆ తర్వాత పంచదార వేసి కలిపి మూకుడు అంచుల వెంట నీళ్లు పోసి కదపకుండా మూత పెట్టి 3-4 నిమిషాలు ఆవిరి మీద ఉడికించుకోవాలి.
- అనంతరం మూత తీసి నిమ్మరసం, కాస్త కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేసుకుంటే హెల్దీ స్ప్రౌట్స్ పొహ రెడీ!
సండే స్పెషల్: ఎంతో రుచిగా ఉండే 'షాహి చికెన్ కుర్మా'- ఒక్కసారి తిన్నారంటే రుచి మర్చిపోరు!
ఈ 'మసాలా ఎగ్ పులుసు' ఎప్పుడైనా తిన్నారా? బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు!