Prathidhwani Debate On Green Hydrogen Concept : గ్రీన్ హైడ్రోజన్. భవిష్యత్ ఆశాకిరణంగా కనిపిస్తోన్న సరికొత్త ఇంధనం! ఆ క్రమంలోనే భారత దేశ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌లో భాగంగా ఇటీవలే కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. శిలాజ ఇంధన వినియోగం తగ్గించి పునరుత్పాదక వనరుల్ని ప్రోత్సహించే దిశగా వేస్తున్న అడుగుల వేగం పెంచింది. సమస్యల్లేని శుద్ధ ఇంధనం కోసం శ్రీకారం చుడుతున్నట్లు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ విశాఖ తీరంలోనే అందుకు సంబంధించి మొదటి హబ్ ఏర్పాటు కానుంది. మరి ఇంతగా అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న గ్రీన్ హైడ్రోజన్ కాన్సెప్ట్ ఏమిటి? ఇది ఇంధన రంగాన్ని ఎలా మలుపు తిప్పనుంది? గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్‌లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రజల జీవనంలో ఎలాంటి మార్పులకు అవకాశం ఉంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.