Kiran Abbavaram Wife Pregnant : టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తాజగాా తన ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు. తాను తండ్రిని కానున్నట్లు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ఓ స్పెషల్ పోస్ట్ షేర్ చేసి ఈ విషయాన్ని పంచుకున్నారు. అందులో తన వైఫ్ రహస్యతో ప్రెగ్నెన్సీ ఫొటోను ఫొటోను పంచుకున్నారు. 'మా ప్రేమ పెరుగుతోంది' అనే క్యూట్ క్యాప్షన్ పెట్టారు. ఈ సంతోషకరమైన సమయంలో అందరి ఆశీస్సులు తమపై ఉండాలని కోరారు. ఇక ఈ పోస్ట్‌పై నెటిజన్లు, సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. కిరణ్-రహస్యకు కంగ్రాజ్యూలేషన్స్ చెప్తున్నారు.
2019లో విడుదలైన 'రాజావారు రాణిగారు' చిత్రంతో కిరణ్ అబ్బవరం అరంగేట్రం చేశారు. ఈ సినిమలో తన సతీమణి రహస్య హీరోయిన్‌గా నటించారు. షూటింగ్ సమయంలో ఈ ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారింది. దాదాపు ఐదేళ్ల పాటు సీక్రెట్‌గా రిలేషన్లో ఉన్న ఈ జంట గతేదాది వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. 2024 ఆగస్టులో కుటుంబసభ్యులు, అతికొద్ది మంది అతిథుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది.
ఇక కిరణ్ అబ్బవరం రీసెంట్గా 'క' మూవీ హిట్ అందుకున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానితి ఆడియెన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు ఆయన దిల్రుబా అనే సినిమాతో అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. తాజాగా విడుదలైన టీజర్ మూవీ లవర్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది.
ముఖ్యంగా ఇందులో కిరణ్ అబ్బవరం లుక్ కొత్తగా ఉందని అభిమానులు అంటున్నారు. శ్వాగ్, యాటిట్యూడ్ కూడా బాగా సూట్ అయ్యాయని అంటున్నారు. ఇక అంజలి పాత్రలో నటించిన రుక్సార్ ధిల్లాన్‌తో తన కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరిందని అంటున్నారు. శ్యామ్ సీఎస్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రాన్ని రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2025 ఫిబ్రవరిలో ఈ సినిమా విడుదల కానుంది. మరోవైపు కొత్తగా విడుదలైన ఫస్ట్ సింగిల్ కూడా మ్యూజిక్ లవర్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది.