ETV Bharat / bharat

ఆస్పత్రి నుంచి సైఫ్‌ అలీ ఖాన్‌ డిశ్చార్జ్‌ - వారంపాటు బెడ్ రెస్ట్ - SAIF ALI KHAN DISCHARGED

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన నటుడు సైఫ్ అలీఖాన్

Saif Ali Khan Discharged
Saif Ali Khan Discharged (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 21, 2025, 3:06 PM IST

Updated : Jan 21, 2025, 3:59 PM IST

Saif Ali Khan Discharged : బాలీవుడ్ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ కోలుకున్నారు. కొద్ది రోజుల క్రితం తన ఇంట్లోకి చొరబడి దుండగుడు కత్తితో దాడి చేయగా, ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పుడు ఐదు రోజుల చికిత్స అనంతరం మంగళవారం సాయంత్రం ముంబయి లీలావతి ఆస్పత్రి నుంచి సైఫ్ అలీ ఖాన్​ డిశ్చార్జ్‌ అయ్యారు.

వారంపాటు సైఫ్ రెస్ట్
వైద్యులు సైఫ్‌కు వారంపాటు బెడ్‌ రెస్ట్‌ సూచించారు. ఇన్ఫెక్షన్‌ చేరకుండా ఉండేందుకు కొంతకాలం బయట వ్యక్తులకు దూరంగా ఉండాలని చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన వెంట తల్లి, నటి షర్మిలా ఠాగూర్‌ ఉన్నారు. సైఫ్‌ సతీమణి, నటి కరీనా కపూర్‌, కుమార్తె సారా అలీఖాన్‌ తదితరులు అంతకుముందు ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లారు. సంబంధిత దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యాయి.

కాగా, జనవరి 16న సైఫ్‌పై దాడి జరిగింది. నటుడి వెన్నెముకకు తీవ్రగాయమైంది. సర్జరీ చేసిన వైద్యులు వెన్నెముక నుంచి కత్తిని తొలగించారు. మరోవైపు, ఈ కేసు విషయమై ముమ్మరంగా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ను అరెస్టు చేశారు. ప్రస్తుతం అతడు కస్టడీలో ఉన్నాడు. ప్రాధమిక విచారణలో నిందితుడికి సంబంధించి కొన్ని కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు.

"మహ్మద్ షరీఫుల్ ఏడు నెలల క్రితమే మేఘాలయలోని డౌకీ నదిగుండా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించాడు. ఇక్కడకు వచ్చాక విజయ్‌దాసుగా పేరు మార్చుకున్నాడు. పశ్చిమ బెంగాల్‌లో కొన్ని వారాల పాటు ఉండి.. ఉద్యోగం వెతుక్కుంటూ ముంబయికి చేరుకున్నాడు. ముంబయి రావడానికి కొన్ని రోజుల ముందు స్థానిక వ్యక్తి ఆధార్‌ కార్డును ఉపయోగించి సిమ్‌ కార్డును తీసుకున్నాడు" అని పోలీసులు తెలిపారు.

"నిందితుడు ఉపయోగించిన సిమ్‌ కార్డు బంగాల్‌కు చెందిన వ్యక్తి పేరుతో రిజిస్టర్ అయింది. నిందితుడు కూడా భారత్‌లో ఉంటున్నట్లు ఆధార్‌ తీసుకోవాలని ప్రయత్నించి విఫలమయ్యాడు" అని పోలీసు అధికారి తెలిపారు. అతడి కాల్‌డేటాను పరిశీలించగా బంగ్లాదేశ్‌కు అనేకసార్లు కాల్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అతడి కుటుంబసభ్యులకు ఫోన్‌ చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

Last Updated : Jan 21, 2025, 3:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.