ETV Bharat / state

టూత్​ బ్రష్​లను ఎలా వినియోగించాలి? - ఎన్ని రోజులకోసారి మార్చాలో మీకు తెలుసా? - DOS AND DONTS OF TOOTHBRUSH STORAGE

పళ్లను తోమే టూత్​ బ్రష్​ వినియోగం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు - ఎన్ని నెలలకోసారి టూత్​ బ్రష్​ను మార్చాలి? తదితర వివరాలు మీ కోసం

Dos And Don'ts of Toothbrush Storage
Dos And Don'ts of Toothbrush Storage (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 21, 2025, 11:46 AM IST

Dos And Don'ts of Toothbrush Storage : హలో. మీ పళ్లను తోమే టూత్‌బ్రష్‌ను శుభ్రం చేస్తున్నారా? క్యాప్​ను ఉపయోగిస్తున్నారా? గాలి, వెలుతురులో ఉంచుతున్నారా? లాంటి ప్రాథమిక అంశాలను నిర్లక్ష్యం చేస్తే సమస్యలు తలెత్తుతాయి. నిత్య జీవితంలో భాగమైన టూత్‌ బ్రష్‌ల వినియోగంలో కనీస జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పళ్ల ఆరోగ్య సంరక్షణ తీరును సిద్దిపేటలోని స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు తమ పరిశోధన ద్వారా స్పష్టం చేశారు. ఆ వివరాలు మీ కోసం.

'టూత్‌ బ్రష్‌ల ద్వారా బ్యాక్టీరియాల వ్యాప్తి' అంశంపై మైక్రో బయాలజీ(సూక్ష్మజీవ), బయో టెక్నాలజీ(జీవసాంకేతిక శాస్త్రం)ల సంయుక్త ఆధ్వర్యంలో మొదటి ఏడాది, తృతీయ సంవత్సరాలకు చెందిన 6 విద్యార్థులు పరిశోధించారు. సూక్ష్మ జీవశాస్త్ర హెచ్​వోడీ డా. జి.మదన్‌మోహన్‌ పర్యవేక్షణలో 45 రోజులు పాటు అధ్యయనం సాగింది. ఇందులో భాగంగా 100 మంది విద్యార్థులు, అధ్యాపకుల టూత్‌బ్రష్‌ల శాంపిల్స్​ను స్వాబ్‌ పద్ధతిలో సేకరించారు. వాటిపై ఉండేటువంటి బ్యాక్టీరియాలతో వ్యాధులు వ్యాప్తి చెందుతాయా? అనే కోణంలో పరిశోధించారు.

ఫలితాల గుర్తింపు ఇలా : ఈ అధ్యయనంలో భాగంగా అందరి బ్రష్‌లలో బ్యాక్టీరియాలు ఉన్నట్లు గుర్తించారు. ప్రధానంగా 3 రకాలు ఎక్కువగా ఉన్నట్లుగా తేల్చారు. 50 శాతం నమూనాల్లో స్ట్రెప్టోకోకస్‌ మ్యుటాన్స్, 40 శాతం నమూనాల్లో స్టెఫైలో కోకస్‌ ఆర్యస్, 20 శాతం శాంపిల్స్​లో ఎస్‌రేషియా కోలి బ్యాక్టీరియాలు ఉన్నట్లుగా వెల్లడైంది.

ఎందుకిలా : టూత్‌ బ్రష్‌లను బాత్‌రూం, సింకుల వద్ద ఉంచడం వల్ల ఆయా బ్యాక్టీరియాలు వాటిని ఆశ్రయిస్తాయి. బ్రష్​లను ఒకే చోట పెట్టినా ప్రమాదమే. ఆవటి పళ్ల (బ్రిసిల్స్‌)కు క్యాప్‌ వంటి రక్షణ లేకపోవడమూ ప్రమాదమే అని అధ్యయనంలో వెల్లడైంది.

సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఎదగాలంటే దంతాలను జాగ్రత్తగా చూసుకోవాలి. దంత క్షయంతో ఇబ్బంది పడే వారి సంఖ్య రోజురోజుకూ క్రమంగా పెరుగుతోంది. ప్రాథమిక అంశాలపై అందరూ అవగాహన పెంచుకోవాలి. టూత్‌ బ్రష్‌ను కచ్చితంగా 3 నెలలకోసారి మార్చాలి. బ్రష్​ శుభ్రం చేసే విధానం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి - డా. అరవింద్‌కుమార్, దంత వైద్యుడు, సిద్దిపేట

సమస్యలెన్నో : స్ట్రెప్టోకోకస్‌ మ్యుటాన్స్‌ బ్యాక్టీరియాతో చిగుళ్ల ఇన్‌ఫెక్షన్, పిప్పి పళ్లు, దంతాల క్షీణత, గొంతు సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. స్టెఫైలో కోకస్‌ ఆర్యస్‌తో గొంతు, ఎస్‌రేషియా కోలి ద్వారా జీర్ణకోశ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని వారు తెలిపారు. వ్యాధి నిరోధక శక్తి(ఇమ్యూనిటీ పవర్) లోపిస్తే వాటి ప్రభావం అధికం.

తీసుకోవాల్సి జాగ్రత్తలు ఇవే : 2 రోజులకోసారి టూత్​బ్రష్‌లను మౌత్‌వాష్‌లో కనీసం 5 నిమిషాలు ఉంచాలి. నిత్యం గోరువెచ్చని నీటితో కడగాలి. సూర్యరశ్మి ఉండే ప్రాంతంలో వాటిని ఉంచాలి. యూవీ కిరణాలు (ఆధునిక పద్ధతి) ప్రసరింపజేసే విధంగా చూసుకోవాలి. అయితే ఈ బాక్సులు ఇంకా మన దగ్గర అందుబాటులోకి రాలేదు. ప్రతి మూడు మాసాల కోసారి వాటిని మార్చాలి.

"టూత్‌బ్రష్‌ల వినియోగంపై విస్తృత అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ పరిశోధన అంశాన్ని ఎంచుకున్నారు. అధ్యయన ప్రాజెక్టుగా స్టేట్​ లెవల్​లో నిర్వహించనున్న జిజ్ఞాస పోటీలకు ప్రతిపాదిస్తాం. ఇప్పటి వరకు విభాగం ఆధ్వర్యంలో కళాశాల నుంచి ఏడేళ్ల వ్యవధిలో 5 ప్రాజెక్టులు రాష్ట్రస్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచాయి." - డా. జి.మదన్‌మోహన్, సూక్ష్మ జీవశాస్త్ర విభాగాధిపతి

దంతాల ఆరోగ్యం కోసం - పళ్లు ఎంతసేపు తోముకోవాలి? బ్రష్​ను ఎన్ని రోజులకు మార్చాలి? - Tooth brushing Mistakes

అలర్ట్​: మార్నింగ్ బ్రష్ చేయకుండా "వాటర్" తాగుతున్నారా? - మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి! - Drink Water Without Brushing

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.