తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీ, నీరజ్ చోప్రా - ఇప్పుడు భారత్‌లో మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్ పర్సన్ ఎవరంటే? - Most Popular Sports Person In India - MOST POPULAR SPORTS PERSON IN INDIA

Most Popular Sports Person In India : టీమ్​ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి భారత మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్ పర్సన్‌గా నిలిచాడు. భారత్‌లో అత్యంత ఆదరణ కలిగిన టాప్ - 10 క్రీడాకారుల జాబితాలో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. మరి ఇంతకీ వరుసగా రెండు ఒలింపిక్​ మెడల్స్​ గెలుచుకున్న నీరజ్ చోప్రా ఏ స్థానంలో ఉన్నాడో తెలుసా?

source IANS and AFP
kohli Neeraj Chopra (source IANS and AFP)

By ETV Bharat Sports Team

Published : Sep 25, 2024, 10:38 AM IST

Most Popular Sports Person In India : ఆగస్టు నెలలో అత్యంత ఆదరణ కలిగిన టాప్ - 10 ఆటగాళ్ల జాబితా తాజాగా విడుదల అయింది. సర్వే నిర్వహించి దీన్ని రిలీజ్ చేశారు. ఈ టాప్ 10 ప్లేయర్స్​లో ఐదుగురు క్రికెటర్లే ఉండటం విశేషం. ఈ లిస్ట్​లో టీమ్​ ఇండియా స్టార్ బ్యాటర్​ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇక ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ మూడో స్థానంలో నిలవగా, ఫుట్‌బాల్ స్టార్, పోర్చుగల్ ప్లేయర్ క్రిస్టియన్ రోనాల్డో నాలుగో స్థానంలో నిలిచాడు.

క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్​ ఐదో స్థానాన్ని కైవసం చేసుకోగా, అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ ఆరో స్థానంలో నిలిచాడు. ఇక భారత బళ్లెం వీరుడు, వరుసగా రెండు ఒలింపిక్​ మెడల్స్​ గెలుచుకున్న నీరజ్ చోప్రా ఏడో స్థానాన్ని దక్కించుకున్నాడు.

భారత ఫుట్‌బాల్​ దిగ్గజం సునీల్ ఛెత్రీ 8వ స్థానంలో నిలిచాడు. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు 9వ స్థానంలో ఉండగా, హార్దిక్ పాండ్య 10వ ర్యాంకును సొంతం చేసుకున్నాడు.

Kohli Brand Value : ఇకపోతే ఇప్పటికే మోస్ట్ బ్రాండ్ వ్యాల్యూ కలిగిన భారత క్రీడాకారుడి గానూ విరాట్ కోహ్లీ నిలిచాడు. సోషల్ మీడియా ప్లాట్​ఫామ్స్​​ ఇన్‌స్టా గ్రామ్, ఎక్స్​(గతంలో ట్విటర్) వేదికగానూ అత్యధిక ఫాలోవర్లు కలిగిన క్రికెటర్​ కూడా కోహ్లీనే కావడం విశేషం. కాగా, టీమ్ ఇండియా కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్​ కోహ్లీ తప్పుకుని దాదాపు రెండేళ్లు అవుతోంది. అయినప్పటికీ ఇంకా స్టార్ బ్యాటర్​గా రాణిస్తూ తన క్రేజ్​ను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం విరాట్​ బంగ్లాతో(IND VS BAN Test Series) జరుగనున్న టెస్​ సిరీస్​లో ఆడుతున్నాడు. తొలి టెస్ట్​లో రాణించలేకపోయిన అతడు రెండో టెస్ట్ కోసం సిద్ధమవుతున్నాడు.

ఇక నాలుగేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి, కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న ధోనీ కూడా రెండో స్థానాన్ని దక్కించుకోవడం విశేషం.

రెండో టెస్ట్​కు బ్లాక్ సాయిల్ పిచ్​ - ఇక్కడ వికెట్​ ఎలా ఉంటుంది? ఎవరికి అనుకూలం? - India vs Bangladesh 2nd Test

క్యా బాత్ హై! - ఆర్టిస్​గా మారిన విరాట్ - ఆ ఐకానిక్​ పిల్లి బొమ్మను చూశారా? - Virat Kohli Cat Drawing

ABOUT THE AUTHOR

...view details