Ind Vs Eng 1st T20 2025: స్వదేశంలో ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు టీమ్ఇండియా సిద్ధమైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య బుధవారం తొలి టీ20 జరగనుంది. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. అయితే ఈ సిరీస్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సహా టీమ్ఇండియా ప్లేయర్లను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. మరి ఆ రికార్డులేంటో చుద్దామా?
రెండో బ్యాటర్‌గా!
భారత్- ఇంగ్లాండ్ కెప్టెన్లు సూర్యకుమార్ యాదవ్ టీ20 ఫార్మాట్లో దూకుడుగా ఆడుతుంటాడు. పవర్ హిట్టింగ్ చేయడంలో సూర్య నెం 1. ఈ క్రమంలోనే సూర్య ఇప్పటివరకు టీ20ల్లో 145 సిక్స్‌లు బాదాడు. ఈ సిరీస్‌లో మరో 5 సిక్స్‌లు సంధిస్తే 150 సిక్స్‌ల మార్క్ అందుకుంటాడు. దీంతో రోహిత్ శర్మ తర్వాత ఈ మైలురాయి అందుకున్న రెండో బ్యాటర్‌గా సూర్య నిలుస్తాడు. రోహిత్ 205 సిక్స్‌లతో వరల్డ్‌లోనే టాప్ ప్లేస్‌లో ఉన్నాడు.
అత్యంత వేగంగా
టీమ్ఇండియా యంగ్ పేసర్ అర్షదీప్ సింగ్ తన కెరీర్లో 60 మ్యాచ్‌ల్లో ఇప్పటివరకు 95 వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్‌లో మరో 5 వికెట్లు తీస్తే ప్రపంచంలోనే అత్యంత వేగంగా టీ20ల్లో 100 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతానికి ఈ రికార్డు పాకిస్థాన్ బౌలర్ హారిస్ రౌఫ్ పేరిట ఉంది. అతడు 71 మ్యాచ్‌ల్లో 100 వికెట్లను పడగొట్టాడు. అలాగే టీ20ల్లో భారత్ తరఫున 100 వికెట్లు నేలకూల్చిన తొలి బౌలర్‌గానూ ఘనత సాధిస్తాడు.
రోహిత్ రికార్డుకు గురి!
వికెట్ కీపర్ సంజూ శాంసన్ కూడా ఓ రికార్డుకు చేరువలో ఉన్నాడు. టీ20ల్లో ఇప్పటివరకు సంజూ 3 సెంచరీలు బాదాడు. ఈ సిరీస్‌లో మరో సెంచరీ బాదితే సూర్యకుమార్ యాదవ్ (4) రికార్డును సమం చేస్తాడు. అదే రెండు సెంచరీలు బాదితే సూర్యకుమార్‌ను అధిగమించి, రోహిత్ శర్మ(5), గ్లెన్ మాక్స్ వెల్ (5) సరసన చేరతాడు.