తెలంగాణ

telangana

ETV Bharat / sports

35ఏళ్ల క్రితమే భారత్ కెప్టెన్​​పై దాడి- అందుకే మనోళ్లు పాకిస్థాన్​కు వెళ్లరట! - CHAMPIONS TROPHY 2025

ఛాంపియన్స్ ట్రోఫీ : టీమ్ఇండియా పాకిస్థాన్ వెళ్లకపోవడానికి అదీ ఓ కారణమే- 35ఏళ్ల నాటి దాడి గుర్తుందా?

Champions Trophy 2025
Champions Trophy 2025 (Source : Getty Images)

By ETV Bharat Sports Team

Published : Nov 21, 2024, 8:41 PM IST

Champions Trophy 2025 India :2025 ఛాంపియన్స్‌ ట్రోఫీకి పాకిస్థాన్‌ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. ఈ మెగా టోర్నీకి సంబంధించి ప్రస్తుతానికి ఇంతే చెప్పగలం. ఎందుకంటే ఏదేమైనా సరే టోర్నీలో పాల్గొనేందుకు టీమ్‌ఇండియా పాకిస్థాన్ వెళ్లబోదని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. అలానే బీసీసీఐ చేసిన హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదనను పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డ్‌(పీసీబీ) అంగీకరించలేదు.

ఐసీసీ కూడా పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డ్‌ని ఒప్పించే ప్రయత్నాలు చేస్తోంది. భారత్‌ మ్యాచ్‌లను దుబాయ్ లేదా శ్రీలంకలో హైబ్రిడ్ ఫార్మాట్‌లో నిర్వహించాలని కోరుతోంది. ఇంత చేసినా పీసీబీ మెట్టు దిగడం లేదు. అయితే టీమ్‌ఇండియాను బీసీసీఐ పాకిస్థాన్‌ పంపకపోవడానికి కారణాలు లేకపోలేదు. 2008లో ముంబయి పేళుల్ల తర్వాత టీమ్ఇండియా పాకిస్థాన్​ వెళ్లడం లేదు. అయితే దీంతోపాటు అంతకుముందు 1989లో జరిగిన ఓ ఘటన కూడా దీనికి ఓ ప్రధాన కారణంగా భావించవచ్చు. అదేంటో తెలుసా?

1989లో భారత్- పాకిస్థాన్ మధ్య టెస్టు సిరీస్ జరిగింది. ఈ సిరీస్‌కు పాకిస్థాన్ ఆతిథ్యమిచ్చింది. తొలి మ్యాచ్ మార్చి 5న కరాచీ మైదానంలో జరిగింది. క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్‌ ఈ మ్యాచ్ ద్వారానే అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆ జట్టుకు కృష్ణమాచారి శ్రీకాంత్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే ఈ మ్యాచ్ మధ్య భారతీయులు ఎప్పటికీ మర్చిపోలేని ఓ చేదు ఘటన జరిగింది.

ఈ మ్యాచ్​లో టీమ్ఇండియా కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్‌పై దాడి జరిగింది. పాకిస్థాన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా మైదానంలోకి ప్రవేశించిన ఓ దుండగుడు ఫీల్డింగ్ చేస్తున్న కృష్ణమాచారిపై దాడి చేశాడు. అంతటితో ఆగకుండా మిగిలిన టీమ్ఇండియా ఫీల్డర్లను సైతం బెదిరించాడు. మహ్మద్ అజారుద్దీన్‌పై కూడా దాడి చేశాడు.

ఈ ఘటన తర్వాత టీమ్‌ఇండియా ప్లేయర్లు భయాందోళనకు గురయ్యారు. ఈ దాడులు, భద్రతలేని పరిస్థితుల్లో భారత్‌ 4 మ్యాచ్‌ల సిరీస్‌ పూర్తి చేసింది. సిరీస్ డ్రాగా ముగిసింది. టీమ్‌ఇండియా ఆటగాళ్లు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. ఇక ఆ తర్వాత కూడా టీమ్ఇండియా పాకిస్థాన్​లో పర్యటించినప్పటికీ 2008లో ముంబయి పేళుల్ల తర్వాత క్రికెట్​లోనూ పూర్తిగా సత్సంబంధాలు దెబ్బతిన్నాయి.

అదే లాస్ట్
క్రికెట్ మ్యాచ్‌లు ఆడేందుకు భారత్ పాకిస్థాన్‌కు వెళ్లకపోవడానికి ప్రధాన కారణం భద్రతా సమస్య. 2008లో ముంబయి పేళుల్ల తర్వాత భారత్ కఠిన నిర్ణయం తీసుకుంది. తగిన భద్రత లేదని పాకిస్థాన్‌కు వెళ్లడం మానేశారు. టీమ్ఇండియా చివరిసారిగా 2008లో పాకిస్థాన్‌లో జరిగిన వన్డే ఆసియా కప్ టోర్నీలో పాల్గొంది.

పాక్​లో మ్యాచ్ ఆడడం టీమ్ఇండియాకు అదే చివరిసారి అయ్యింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగలేదు. పాకిస్థాన్‌లో టీమ్‌ఇండియా ఏ టోర్నీ ఆడలేదు. కేవలం ఐసీసీ నిర్వహించిన టోర్నీలు, ఆసియా కప్‌లో మాత్రమే భారత్- పాక్ తలపడుతున్నాయి.

ఛాంపియన్స్ ట్రోఫీ - పాక్‌ను ఒప్పించేందుకు ఐసీసీ తెర వెనక ప్రయత్నాలు!

'పాక్​కు వచ్చేందుకు వాళ్లకు ఇబ్బంది లేదు- భారత్​కు సమస్య ఉంటే వచ్చి మాట్లాడాలి!'

ABOUT THE AUTHOR

...view details