Rohit Sharma Retirement:టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ 2024 టీ20 వరల్డ్‌కప్ తర్వాత పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన రిటైర్మెంట్ గురించి 37ఏళ్ల రోహిత్ స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. జాతీయ జట్టుకు మరికొన్ని సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించాలని ఉందని అన్నాడు. తాజాగా దుబాయ్ ఐ 103.8 వెబ్సైట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.
ఈ ఇంటర్వ్యూలో రోహిత్ పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు.'క్రికెట్ కెరీర్ ప్రారభించి 17 ఏళ్లైంది. ఈ జర్నీ అద్భుతంగా సాగుతోంది. ఇంకొన్నేళ్లపాటు ఆడుతూ, ప్రపంచ క్రికెట్లో నా ఇంపాక్ట్ చూపించగలనన్న నమ్మకం ఉంది' అని రోహిత్ అన్నాడు. ఇక ఇదే ఇంటర్వ్యూలో కెప్టెన్సీ గురించి కూడా రోహిత్ మాట్లాడాడు.
'జాతీయ జట్టుకు సారథ్యం వహించే అవకాశం రావడం గొప్ప విషయం. నాకు కెప్టెన్సీ చేసే ఛాన్స్ వస్తుందని అనుకోలేదు. కానీ, వచ్చింది. అందరూ అంటుంటారు కదా, మంచి వాళ్లకు ఎప్పుడూ మంచి జరుగుతుందని. అందుకే నాకు ఈ గౌరవం దక్కిందనుకుంటా. నేను కెప్టెన్సీ అందుకున్నాక, జట్టును ఒక డైరెక్షన్లో నడిపించాలనున్నా. అందరూ జట్టు కోసమే తప్పా వ్యక్తిగత రికార్డులు, గణాంకాల కోసం కాదని చెప్పాలనున్నాను. జట్టులోని 11మంది కలిస్తేనే ట్రోఫీలు సాధించగలం' అని రోహిత్ పేర్కొన్నాడు.