Gautam Gambhir Meeting:టీమ్ఇండియా కొత్త హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ శ్రీలంక పర్యటనకు ముందే సెలక్షన్ కమిటీతో సమావేశం జరపనున్నట్లు తెలుస్తోంది. తాను హెడ్కోచ్ పదవిలో సెలక్షన్ కమిటీతో భేటీ అవ్వడం ఇదే తొలిసారి కానుంది. అయితే ఈ మీటింగ్లో శ్రీలంక పర్యటన, జట్టు టీ20 ఫార్మాట్ కెప్టెన్సీపై చర్చించుకోనున్నట్లు సమాచారం.
అయితే టీమ్ఇండియా త్వరలోనే శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ టార్లో 3 టీ20, 3 వన్డే మ్యాచ్లు ఆడాల్సి ఉంది. జులై 27 నుంచి ప్రారంభం కానున్న ఈ పర్యటనకు సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ నేపథ్యంలో వీళ్ల గైర్హాజరీలో ఎవరు జట్టను సమర్థంగా నడిపించగలరు? జట్టు ఎంపిక ఎలా ఉండాలన్న అంశాలు సెలక్టర్ల మీటింగ్లో చర్చించే ఛాన్స్ ఉంది.
హార్దిక్ లేదా రాహుల్
ఈ పర్యటనకు కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య ఎంపిక దాదాపు ఖాయం. అయితే ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు జట్టును నడిపించే అవకాశం ఉంది. దీంతో ఎవరికి కెప్టెన్సీ దక్కుతుందోనని ఆసక్తి నెలకొంది. కాగా, వీరిద్దరికి ఇదివరకు టీమ్ఇండియాకు కెప్టెన్గా వ్యవహరించిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో టీ20 సిరీస్కు హార్దిక్, వన్డే సిరీస్కు కేఎల్ రాహుల్ జట్టను నడిపించే ఛాన్స్ ఉంది.