Piyush Chawla On Kevin Pietersen:టీమ్ఇండియా మాజీ స్పిన్నర్ పీయూశ్ చావ్లా అంటే తెలియని వారుండరు. ఆడిన అంతర్జాతీయ మ్యాచ్‌లు తక్కువే అయినప్పటికీ తన బౌలింగ్‌తో అభిమానులను మెప్పించాడు ఈ స్పిన్నర్. 17 ఏళ్ల వయసులోనే ఇంటర్నేషన్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ తర్వాత తక్కువ వయసులో టెస్టుల్లో టీమ్ ఇండియా తరఫున అరంగేట్రం చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో తన అరంగ్రేట మ్యాచ్ గురించి పీయూశ్ ఇటీవల ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. అదేంటంటే?
తొలి ఓవర్ మెయిడిన్
2006లో ఇంగ్లాండ్ జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో పీయూశ్ అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలి ఓవర్‌నే మెయిడిన్‌గా మలిచాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ విధ్వంసర బ్యాటర్ కెవిన్ పీటర్సన్ బ్యాటింగ్ వచ్చాడు. పీయూశ్పై ఏమాత్రం కనికరం చూపకుండా అతడి రెండో ఓవర్ లో ఒక ఫోర్, ఒక సిక్స్ బాదాడు. యువ స్పిన్నర్‌పై పూర్తి ఆధిపత్యాన్ని చెలాయించాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో పీయూశ్ 9 ఓవర్లు వేసి ఒక్క వికెట్ కూడా తీయకుండా 45 పరుగులు ఇచ్చాడు. అయితే ఈ మ్యాచ్ అనంతరం పీయూశ్తో ఇంగ్లాండ్ బ్యాటర్ పీటర్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడట .
ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ అయినా, 17 ఏళ్ల పిల్లాడి బౌలింగ్ అయినా తాను విధ్వంసకరంగా బ్యాటింగ్ చేస్తానని మ్యాచ్ అనంతరం పీటర్సన్ పీయూశ్ చావ్లాకు చెప్పాడట. ఆ అనుభవం తన అంతర్జాతీయ కెరీర్‌కు స్వాగతం లాంటిదని పీయూశ్ అభిప్రాయపడ్డాడు. ' నా మొదటి టెస్ట్ మ్యాచ్‌లో పీటర్సన్ నా బౌలింగ్‌లో బంతుల్ని మైదానం అవతలికి పంపించాడు. దేశవాళీ క్రికెట్లో చాలా సార్లు ఐదు వికెట్లు తీశాను. కానీ నేను నా మొదటి టెస్ట్ ఆడినప్పుడు, అంతర్జాతీయ క్రికెట్ ఎందుకు కష్టమైందో నాకు అర్థమైంది' అని పీయూశ్ ఓ పాడ్ కాస్ట్లో చెప్పుకొచ్చాడు.
రెండో ఇన్సింగ్స్‌లో ఫర్వాలేదనిపించిన పీయూశ్
అయితే రెండో ఇన్నింగ్స్ లో పీయూశ్ పుంజుకుని 8 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. అది కూడా ఇంగ్లాంగ్ ఆల్ రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ ది కావడం విశేషం. ఈ మ్యాచ్ లో టీమ్ ఇండియా విజయం సాధించింది. దీంతో మ్యాచ్ విజయంతో భారత్ 1-0తో సిరీస్ లో ఆధిక్యంలో నిలిచింది. దీంతో పీయూశ్ తొలి టెస్ట్ మ్యాచ్ లో రెండు ఇన్సింగ్స్ ల్లో కలిపి ఒక వికెట్ మాత్రమే తీశాడు.