Ind vs Ban Test Series 2024:టీమ్ఇండియా స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు సిద్ధం అవుతోంది. ఈ సిరీస్‌లో బంగ్లాతో భారత్ రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 19న తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు చెన్నై చెపాక్ స్టేడియం వేదిక కానుంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా ప్లేయర్లంతా చెన్నై చేరుకొని ఇప్పటికే నెట్స్‌లో ప్రాక్టీస్ ప్రారంభించేశారు. అయితే స్టార్లు బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ ఓ అరుదైన రికార్డుకు అతి చేరువలో ఉన్నారు. ఈ సిరీస్‌లోనే వాళ్లిద్దరూ ఆ ఘతన అందుకునే ఛాన్స్ ఉంది. మరి అదేంటంటే?
Bumrah International Wickets : 2016లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన బుమ్రా అప్పట్నుంచి టీమ్ఇండియాకు కీలకంగా మారాడు. మూడు ఫార్మాట్లలోనూ టీమ్ఇండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో కలిపి 195 మ్యాచ్‌ల్లో 397 వికెట్లు పడగొట్టాడు. మరో 3 వికెట్లు పడగొడితే 400 క్లబ్లో చేరతాడు. ఈ క్రమంలో ఈ ఫీట్ సాధించిన 10వ భారత బౌలర్‌గా బుమ్రా నిలుస్తాడు.
Kuldeep International Wickets:చైనామెన్ కుల్గీప్ యాదవ్ కూడా ఓ రేర్ ఫీట్‌కు దగ్గరలో ఉన్నాడు. 2017లో ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చిన అతడు టీమ్ఇండియాకు స్పిన్ విభాగంలో కీలకంగా మారాడు. కుల్దీప్ ఇప్పటివరకు అంతర్జాతీయంగా 294 వికెట్లు పడగొట్టాడు. అందులో 53 (టెస్టు), 172 (వన్డే), 69 (టీ20)ల్లో సాధించాడు. మరో 6 వికెట్లు పడగొడితే కుల్దీప్ 300 వికెట్ల క్లబ్లో చేరిపోతాడు. అయితే టీమ్ఇండియా తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన లిస్ట్‌లో అనిల్ కుంబ్లే టాప్‌లో ఉన్నాడు. కుంబ్లే 401 మ్యాచ్‌ల్లో 953 వికెట్లు పడగొట్టాడు.