తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీమ్​ఇండియాకు పొంచి ఉన్న డేంజర్ - ఆ గండం దాటితేనే సెమీస్​కు! - T20 Worldcup 2024 Super

T20 Worldcup 2024 Super 8 : సూపర్-8లో టీమ్​ఇండియా ఆసీస్‌, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్​తో పోటీ పడనున్నాయి. అందులో ఒక్కటి ఓడినా సెమీస్‌ అవకాశాలు దెబ్బతినే అవకాశం లేకపోలేదు. పూర్తి వివరాలు స్టోరీలో

sourcey Getty Imges
T20 Worldcup 2024 Super 8 (sourcey Getty Imges)

By ETV Bharat Telugu Team

Published : Jun 18, 2024, 11:31 AM IST

T20 Worldcup 2024 Super 8 :టీ20 ప్రపంచకప్​ 2024 ఎనిమిది జట్లతో సూపర్ - 8 సమరం ప్రారంభం కానుంది. టీమ్‌ ఇండియా గురువారం(జూన్ 20) నుంచి తమ మ్యాచ్​లను ప్రారంభించనుంది. గ్రూప్ - 1లో ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌ జట్లతో పోటీ పడనుంది. ఇందులో రెండు జట్లను తక్కువగా అంచనా వేయలేం. ఎందుకంటే అవి ఇప్పటికే పెద్ద జట్లకు షాక్‌లు ఇచ్చాయి.

తక్కువ అంచనా వేయలేం - లీగ్‌ స్టేజ్‌లో ఏకంగా న్యూజిలాండ్‌పై 84 పరుగుల తేడాతో విజయం సాధించి సత్తా చాటింది అఫ్గానిస్థాన్​. గ్రూప్-Cలో విండీస్​, కివీస్​ వంటి బలమైన టీమ్స్​తో పాటు కొత్తగా వచ్చిన ఉగాండా, పాపువా న్యూగినీతో పోటీ పడింది అఫ్గాన్ జట్టు. అంచనాలు తారుమారు చేసి కివీస్‌కు షాక్‌ ఇచ్చిన అఫ్గాన్‌ మిగతా జట్లపైన గెలుపొంది సూపర్-8కి అర్హత సాధించింది. వెస్టిండీస్​ చేతిలో మాత్రమే ఓడిపోయింది.

అఫ్గాన్‌ కెప్టెన్ రషీద్‌ ఖాన్​తో పాటు గుర్బాజ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, ఇబ్రహీం జద్రాన్, నబీ, గుల్బాదిన్ నైబ్, ఫరూఖి, నూర్ అహ్మద్, నవీనుల్‌ హక్ డేంజరస్​ ప్లేయర్స్​. మ్యాచ్‌ను తమవైపు తిప్పుకోగల సామర్థ్యం ఉన్నవారు. ప్రపంచ కప్‌లో ఇప్పటి వరకు అత్యధిక రన్స్​ సాధించిన బ్యాటర్ల జాబితాలో 167 పరుగులతో గుర్బాజ్ ముందున్నాడు. బౌలర్లలో ఫరూఖి (12) టాప్‌ వికెట్‌ టేకర్​గా ఉన్నాడు. ఇలాంటి బలమైన టీమ్​తో జూన్ 20న బార్బడోస్ వేదికగా టీమ్​ఇండియా తొలి మ్యాచ్‌లో పోటీపడనుంది.

బంగ్లాతో కూడా జాగ్రత్తగా! - గ్రూప్-D నుంచి రెండో స్థానంలో నిలిచింది బంగ్లాదేశ్‌. కేవలం సౌతాఫ్రికా చేతిలోనే ఓటంది. లంక, నెదర్లాండ్స్‌, నేపాల్​ జట్లను ఓడించి సూపర్‌-8కు అర్హత సాధించింది. మాజీ కెప్టెన్ షకిబ్ అల్‌ హసన్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. కాబట్టి షకిబ్‌తో పాటు కెప్టెన్ షాంటో, మహ్మదుల్లా, తన్జిద్​ను అడ్డుకుంటే దాదాపు సగం గెలిచినట్లే. బౌలింగ్‌లోనూ ముస్తాఫిజర్‌ కీలకంగా ఉన్నాడు. అతడికి భారత బ్యాటర్ల ఆటతీరుపై ఓ అవగాహన ఉంది. రిషద్, తస్కిన్ కూడా డేంజరే. ఇలాంటి బంగ్లాదేశ్‌ జట్టుతో టీమ్​ఇండియా జూన్ 22న ఆంటిగ్వా వేదికగా తలపడనుంది.

ఆస్ట్రేలియాతో సవాల్‌! - గ్రూప్‌ - Bలో నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందిన ఆస్ట్రేలియా లీగ్ స్టేజ్​లో బలమైన ఇంగ్లాండ్​తో పాటు నమీబియా, ఒమన్, స్కాట్లాండ్‌ను ఓడించింది. ఓపెనర్లు వార్నర్, ట్రావిస్ హెడ్, మార్కస్ స్టాయినిస్ చెలరేగుతున్నారు. బౌలింగ్‌లో స్టార్క్, ఆడమ్ జంపా ప్రత్యర్థులను ఆటాడేసుకుంటున్నారు. ఆసీస్‌తో భారత్ జూన్ 24న సెయింట్‌ లూసియా వేదికగా పోటీపడనుంది.

సూపర్‌ - 8లో భారత్​ అఫ్గాన్‌, బంగ్లా, ఆసీస్​పై గెలిస్తే సెమీస్‌ చేరేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే నెట్‌రన్‌రేట్‌ కీలకం అవుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

నికోలస్ పూరన్ విధ్వంసం - ఒకే ఓవర్​లో 36 పరుగులు - T20 Worldcup 2024

T20 ప్రపంచకప్ 2026కు అర్హత సాధించిన 12 జట్లు ఇవే - T20 WorldCup 2026

ABOUT THE AUTHOR

...view details