T20 World Cup Super 8 Scenario:టీ20 వరల్డ్ కప్ 2024 గ్రూప్ స్టేజ్ ఆసక్తికరంగా మారింది. టైటిల్ ఫేవరెట్స్‌గా బరిలో దిగిన టీమ్‌లు కొన్ని సూపర్ 8కి క్వాలిఫై కావడానికి తంటాలు పడుతున్నాయి. కొన్ని చిన్న జట్లు ఇప్పటికే క్వాలిఫై కాగా, మరికొన్ని ఇంకా రేసులో ఉన్నాయి. ప్రస్తుతం ఐదు టీమ్‌లు సూపర్ 8కి వెళ్లాయి. మిగతా మూడు జట్లు ఏవో త్వరలో తేలనుంది.
సూపర్ 8కి చేరిన టీమ్‌లు
భారత్: గ్రూప్ ఏ నుంచి టీమ్ ఇండియా 3 మ్యాచుల్లో 3 విజయాలు, 6 పాయింట్లతో క్వాలిఫై అయింది. + 1.137 నెట్ రన్ రేటుతో అగ్రస్థానంలో ఉంది.
ఆస్ట్రేలియా:గ్రూప్ బీ నుంచి ఆస్ట్రేలియా సూపర్ 8కి క్వాలిఫై అయింది. 3 మ్యాచుల్లో 3 విజయాలతో 6 పాయింట్లు సాధించింది. +3.850 నెట్ రన్ రేటుతో టాప్ పొజిషన్‌లో ఉంది.
సౌతాఫ్రికా:సౌతాఫ్రికా కూడా ఆడిన మూడు మ్యాచుల్లో విజయాలు అందుకుని 6 పాయింట్లతో సూపర్ 8కి వెళ్లింది. +0.603 నెట్ రన్ రేటుతో గ్రూప్ డీలో ఫస్ట‌్ ప్లేస్‌లో ఉంది.
అఫ్గానిస్థాన్:అఫ్గానిస్థాన్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ గ్రూప్ సీలో అగ్రస్థానం దక్కించుకుంది. 3 మ్యాచుల్లో 3 విజయాలు, 6 పాయింట్లు సాధించింది. +4.320 మెరుగైన నెట్ రన్ రేటుతో వెస్టిండీస్ కంటే మెరుగైన స్థానంలో ఉంది.
వెస్టిండీస్:గ్రూప్ సీ నుంచి వెస్టిండీస్ సూపర్ 8కి అర్హత సాధించింది. 3 మ్యాచుల్లో 3 విజయాలతో 6 పాయింట్లు దక్కించుకుంది. +2.956 నెట్ రన్ రేటుతో గ్రూపులో సెకండ్ ప్లేస్‌లో ఉంది.
మిగతా మూడు బెర్త్‌లు ఎవరికో?
- గ్రూప్ ఏ:రెండో పొజిషన్ కోసం యూఎస్, పాకిస్థాన్ పోటీ పడుతున్నాయి. జూన్ 14న ఈ రోజు ఐర్లాండ్‌తో అమెరికా ఆడుతుంది. ఇందులో అమెరికా గెలిస్తే నేరుగా క్వాలిఫై అవుతుంది. ఒక వేళ ఓడిపోతే పాకిస్థాన్‌కి అవకాశం ఉంటుంది. 16న ఐర్లాండ్‌తోనే పాక్ తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలిస్తే, సూపర్ 8కి వెళ్తుంది. అదృష్టవశాత్తు రెండు మ్యాచుల్లోనూ ఐర్లాండ్ భారీ విజయాలు అందుకుంటే యూఎస్‌ఏ, పాక్ ఎలిమినేట్ అయి ఐర్లాండ్ క్వాలిఫై అవుతుంది.
- గ్రూప్ బీ:జూన్ 15న ఇంగ్లండ్, నమీబియా తలపడుతున్నాయి. నమీబియా ఇప్పటికే ఎలిమినేట్ అయింది. అయితే ఈ మ్యాచ్ ఇంగ్లండ్‌కి కీలకం. ఇంగ్లండ్ గెలిస్తే ఐదు పాయింట్లతో స్కాట్లాండ్‌తో సమం అవుతుంది. అయితే జూన్ 16న ఆస్ట్రేలియాతో స్కాట్లాండ్ ఆడనుంది. ఇందులో స్కాట్లాండ్ గెలిస్తే 7 పాయింట్లతో క్వాలిఫై అవుతుంది. ఓడిపోతే నెట్ రన్ రేట్‌లో ఇంగ్లండ్‌తో పోటీ పడుతుంది. దురదృష్టవశాత్తు నమీబియాతో ఇంగ్లండ్ ఓడిపోతే స్కాట్లాండ్‌కి ఎలాంటి సమస్య ఉండదు. సెకండ్ ప్లేస్ కోసం ఇంగ్లండ్, స్కాట్లాండ్ ప్రయత్నిస్తున్నాయి.
- గ్రూప్ డీ:ఈ గ్రూప్‌లో బంగ్లాదేశ్, నెదర్లాండ్ క్వాలిఫై పొజిషన్ కోసం పోరాడుతున్నాయి. బంగ్లాదేశ్ ఇప్పటికే 3 మ్యాచుల్లో 2 విజయాలు, 4 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. నెదర్లాండ్ 3 మ్యాచుల్లో 1 విజయంతో 2 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.
బంగ్లా తన చివరి మ్యాచ్‌లో 17న నేపాల్‌తో తలపడుతుంది. ఇందులో గెలిస్తే బంగ్లాదేశ్ సూపర్ 8కి వెళ్తుంది. నెదర్లాండ్ 17న శ్రీలకంతో తలపడుతుంది. ఇందులో గెలిచినా, బంగ్లా ఓడిపోతేనే అవకాశం ఉంటుంది. బంగ్లా, నెదర్లాండ్ రెండూ ఓడిపోయినా, బంగ్లా క్వాలిఫై అవుతుంది.
ప్రపంచకప్ మధ్యలోనే స్వదేశానికి రానున్న ఆ ఇద్దరు ప్లేయర్స్! - T20 Worldcup 2024
పాపువాపై విజయంతో సూపర్ -8కు అఫ్గాన్ - న్యూజిలాండ్ ఇంటికి!