T20 World Cup New Zealand Squad:2024 టీ20 వరల్డ్‌కప్‌కు కివీస్ జట్టును న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టును కివీస్ సోమవారం అనౌన్స్ చేసింది. ఈ జట్టుకు కేన్ విలియమ్సన్ నాయకత్వం వహించనున్నాడు. కాగా, జూన్ 1న పొట్టి ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఈ వరల్డ్‌కప్ టోర్నీకి వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇక పొట్టికప్‌కు అన్ని జట్లు సిద్ధమవుతున్నతరుణంలో కివీస్ అందరికంటే ముందుగా టీమ్ ప్రకటించింది.
ఇక ఇవాళ ఇంగ్లాండ్ టీమ్ కూడా ప్రకటించే ఛాన్స్ ఉంది. మరో రెండ్రోజుల్లో టీమ్ఇండియా స్క్వాడ్ కూడా రానుంది. ఈ టీమ్‌కు గ్యారీ స్టెడ్ హెడ్ కోచ్ కాగా, లుక్ రాంచీ బ్యాటింగ్, జేకబ్ ఓరమ్ బౌలింగ్ కోచ్‌లుగా వ్యవహరించనున్నారు. ఇక వచ్చే నెల 23న పొట్టి ప్రపంచకప్ కోసం కివీస్ జట్టు వెస్టిండీస్ బయల్దేరనుంది. విండీస్ వేదికగా ఈ టోర్నీలో కివీస్, అఫ్గానిస్థాన్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది.
అయితే కివీస్ బోర్డు జట్టును ప్రకటించడంలో కాస్త వినూత్నంగా ఆలోచించింది. జట్టు కోచ్, సెలక్షన్ కమిటీ మెంబర్ కాకుండా ఇద్దరు చిన్నారులచే సభ్యుల పేర్లను అనౌన్స్ చేయించారు. మీడియా ముందుకు వచ్చిన చిన్నారులు ముందుగా వాళ్ల పేర్ల చెప్పి పరిచయం చేసుకున్నారు. తర్వాత ఒక్కొక్కరి పేర్లు అనౌన్స్ చేసి, ఎంపికైన వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు చేసిన ఈ ప్రయత్నం అందరికీ నచ్చింది. సోషల్ మీడియాలో ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీంతోపాటు కివీస్ వరల్డ్‌కప్‌లో ధరించే కొత్త జెర్సీని కూడా రివీల్ చేసింది. రెగ్యులర్ బ్లాక్ కాకుండా కొత్త జెర్సీ డిఫరెంట్‌గా ఉంది.