Tilak Varma Century :సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. గురువారం సెంచూరియన్ వేదికగా జరిగిన మూడో మ్యాచ్‌లో టీమ్ఇండియా 11 పరుగుల తేడాతో నెగ్గింది. ఈసారి వన్ డౌన్లో బరిలోకి దిగిన తెలుగు తేజం తిలక్ వర్మ సూపర్ సెంచరీతో అదరగొట్టాడు. అయితే తిలక్ తనకు చెప్పి మరీ ఈ మ్యాచ్‌లో రప్ఫాడించాడని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు.
'రెండో మ్యాచ్ తర్వాత తిలక్ నా రూమ్‌లోకి వచ్చాడు. మూడో టీ20లో వన్ డౌన్లో బ్యాటింగ్‌కు దిగుతానని నాతో చెప్పాడు. తప్పుకుండా రాణిస్తాననే నమ్మకం ఉందని అన్నాడు. అందకు నేను కూడా సరే అన్నాను. అప్పుుడు అడిగి మరీ ఛాన్స్ తీసుకున్న తిలక్, ఇప్పుడు సెంచరీతో అదరగొట్టాడు. దీంతో తనతోపాటు ఫ్యామిలీ కూడా హ్యాపీగానే ఉండి ఉంటారు. ఇక ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ఆనదంగా ఉంది. చర్చించుకున్నట్లే మేం బ్రాండ్ క్రికెట్ ఆడాం. మా కుర్రాళ్లు నెట్స్‌లో బాగా ప్రాక్టీస్ చేశారు. జట్టు మంచి మార్గంలోనే వెళ్తుందని అనుకుంటున్నా' అని మ్యాచ్ అనంతరం సూర్య కుమార్ అన్నాడు.
ఇది నా కల
'సెంచరీ కంటే మ్యాచ్ గెలవడం ఎక్కువ ఆనందాన్ని ఇచ్చింది. అది మాటల్లో చెప్పలేను. దేశం తరఫున ఆడాలని, సెంచరీ చేయాలనేది నా కల. అది ఇప్పుడు నిజమైంది. ఈ క్రెడిట్ అంతా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌దే. నాకు మూడో స్థానంలో బరిలో దిగే ఛాన్స్ ఇచ్చింది అతడే. అందుకే మరోసారి సూర్యకు థాంక్స్. తొలుత పిచ్ పేస్‌కు సహకరించింది. కొత్తగా వచ్చిన బ్యాటర్లకు పరుగులు చేయడం ఈజీ కాదు. అభిషేక్ ఔటైన తర్వాత బ్యాటింగ్‌కు వచ్చే ప్లేయర్లపై ఒత్తిడి లేకుండా చేయాలన్న ఉద్దేశంతోనే దూకుడు పెంచాను. మంచి పార్ట్నర్షిప్ నమోదైతే భారీ స్కోర్ ఖాయమని అనుకున్నా' అని సెంచరీ హీరో తిలక్ వర్మ పేర్కొన్నాడు. తొలి సెంచరీతోనే రికార్డ్
తిలక్ వర్మ కెరీర్లో తొలి సెంచరీతోనే రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. టీమ్ఇండియా తరఫున అంతర్జాతీయ టీ20 సెంచరీ చేసిన రెండో అతి పిన్నవయస్కుడి (22 ఏళ్ల 4 రోజులు)గా నిలిచాడు. ఈ లిస్ట్‌లో యశస్వీ జైస్వాల్ (21 ఏళ్ల 279 రోజుల్లో నేపాల్‌పై)
తిలక్ వర్మ సూపర్ సెంచరీ- టీమ్ఇండియా థ్రిల్లింగ్ విన్
తిలక్ వర్మ సూపర్ సెంచరీ - మూడో టీ20లో దక్షిణాఫ్రికా ముందు భారీ లక్ష్యం