ETV Bharat / sports

'WTC కాన్సెప్ట్ కన్​ఫ్యూజన్​గా ఉంది- అసలు అర్థం అవ్వడం లేదు'

WTC కాన్సెప్ట్​గా ఇంగ్లాండ్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు- టోర్నీ కాన్సెప్ట్ అర్థం అవ్వడం లేదట!

Ben Stokes WTC
Ben Stokes WTC (Source : Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : 3 hours ago

Ben Stokes WTC : 2025 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ రేస్‌ ఆసక్తికరంగా మారింది. 19 మ్యాచ్‌ల్లో 9 విజయాలతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో 40.79 పాయింట్ శాతంతో ఇంగ్లాండ్ ఆరో స్థానంలో కొనసాగుతోంది. దీంతో ఫైనల్‌కు అర్హత సాధించడం అసాధ్యంగా కనిపిస్తోంది. ఇదే విషయంపై కెప్టెన్ బెన్ స్టోక్స్ మాట్లాడాడు. WTC కన్​ఫ్యూజన్​గా ఉందని అన్నాడు. ఈ టోర్నీ కాన్సెప్ట్‌ అర్థం కావడం లేదని చెప్పాడు.

'నిజాయితీగా చెప్పాలంటే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ కొంచెం గందరగోళంగా ఉంది. అయినా మేం దాన్ని పట్టించుకోం. మీరు నిజంగా మంచి క్రికెట్ ఆడుతుంటే, కోరుకున్న ఫలితాలు సాధిస్తారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ గురించి ఆలోచించడానికి నేను ఎప్పుడైనా సమయం కేటాయించినట్లు కూడా గుర్తు లేదు. ఎందుకంటే ఇది పూర్తిగా గందరగోళంగా ఉంది. మేము అందరికంటే ఎక్కువ క్రికెట్ ఆడతాం. మేము మంచి ప్రదర్శన చేస్తే అక్కడ ఉంటాము లేదా ఉండం'అని పేర్కొన్నాడు.

ప్రస్తుతానికి టోర్నీ గురించి అస్సలు ఆలోచించడం లేదని, క్రికెట్‌పై మాత్రమే తాము దృష్టి పెట్టాలనుకుంటున్నానని పేర్కొన్నాడు. డబ్ల్యూటీసీలో స్థిరంగా రాణిస్తే చివరికి ఫైనల్‌కు అర్హత సాధిస్తామని స్టోక్స్‌ చెప్పాడు. అయితే ప్రస్తుత క్రికెటర్లు దృష్టి సారించే విషయం అది కాదని, ఇంగ్లాండ్‌ ఇతర దేశాల కంటే ఎక్కువ టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతుందన్నాడు. ముందున్న సిరీస్ వదిలేసి డబ్ల్యూటీసీ గురించి తమ ప్లేయర్లు ఆలోచించరని అన్నాడు.

మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం ఇంగ్లాండ్ ప్రస్తుతం న్యూజిలాండ్‌లో పర్యటిస్తోంది. మొదటి రోజు ఆతిథ్య జట్టు బాగా బ్యాటింగ్ చేసింది. కేన్ విలియమ్సన్ 93 పరుగులతో రాణించడంతో న్యూజిలాండ్ 319/8 స్కోర్ చేసింది. ఇంగ్లాండ్ తరఫున షోయబ్ బషీర్ అత్యధికంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు.

డబ్ల్యూటీసీ టేబుల్‌
ప్రస్తుతం ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ టేబుల్‌లో భారత్‌ 61.11 శాతం పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. 15 టెస్టుల్లో 9 విజయాలు దక్కించుకుంది. రెండో స్థానంలో 57.69 పాయింట్లతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో నిలిచింది. ఆసీస్‌ 13 టెస్టుల్లో 8 గెలిచింది. మూడో స్థానంలోని శ్రీలంక (55.56) 9లో 5 విజయాలు దక్కించుకుంది. నాలుగులో ఉన్న న్యూజిలాండ్‌ (54.55) 11లో 6, ఐదులో దక్షిణాఫ్రికా (45.17) 8లో 4 టెస్టులు గెలవడం గమనార్హం.

బెన్‌స్టోక్స్ ఇంట్లో విలువైన వస్తువుల చోరీ - సాయం కోరిన ఇంగ్లాండ్​ కెప్టెన్

క్రాలే LBW కాంట్రవర్సీ- టెక్నాలజీదే లోపమన్న స్టోక్స్- రవిశాస్త్రి స్ట్రాంగ్ రిప్లై!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.