Smriti Mandhana 4 ODI Centuries : ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత ఓపెనర్ స్మృతి మంధాన అదరగొట్టింది. భారీ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో అద్భుతమైన సెంచరీ బాదింది. 109 బంతుల్లో 105 పరుగులతో ఆకట్టుకుంది. అయితే ఆమె సంచలనాత్మకమైన సెంచరీ వృథా అయింది. వరుసగా మూడో వన్డేలో కూడా భారత మహిళా జట్టు ఓడిపోయింది. ఆస్ట్రేలియా 83 పరుగుల తేడాతో గెలిచింది.
ఈ సెంచరీతో మంధాన అరుదైన రికార్డు క్రియేట్ చేసింది. ఒక క్యాలెండర్ ఇయర్‌లో నాలుగు వన్డే సెంచరీలు సాధించిన మొదటి మహిళా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పింది. 2024లో ఆమె దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి అగ్రశ్రేణి జట్లపై సెంచరీలు బాది అద్భుత ఫామ్‌లో ఉంది.
సెంచరీలు ఇవే
117 వర్సెస్ దక్షిణాఫ్రికా (హోమ్)
136 వర్సెస్ దక్షిణాఫ్రికా (హోమ్)
100 వర్సెస్ న్యూజిలాండ్ (హోమ్)
105 వర్సెస్ ఆస్ట్రేలియా (ఫారెన్ పిచ్) ఉన్నాయి.
మొత్తంగా స్మృతి, ఈ ఏడాది కేవలం 10 మ్యాచ్‌లలో 59.9 యావరేజ్, 97.08 స్ట్రైక్ రేట్‌తో 599 పరుగులు చేసింది.
సమీపంలో లారా వోల్వార్డ్
దక్షిణాఫ్రికాకు చెందిన లారా వోల్వార్డ్ కూడా ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. 2024లో ఇప్పటివరకు మూడు సెంచరీలు చేసింది. ఈ ఏడాది 11 మ్యాచుల్లో 90.85 యావరేజ్‌తో 636 పరుగులు చేసింది.
ఒక ఏడాదిలో అత్యధిక వన్డే సెంచరీలు
1.స్మృతి మంధాన (భారతదేశం, 2024)
మ్యాచ్‌లు: 10*
పరుగులు: 599
అత్యధిక స్కోరు: 136
యావరేజ్: 59.9
స్ట్రైక్ రేట్: 97.08
సెంచరీలు: 4
2.నాట్ స్కివర్-బ్రంట్ (ఇంగ్లాండ్, 2023)
మ్యాచ్‌లు: 6
పరుగులు: 393
అత్యధిక స్కోరు: 129
యావరేజ్: 131
స్ట్రైక్ రేట్: 107.37
సెంచరీలు: 3