Bhagwant Mann On Congress : పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో అసమ్మతి రాజుకుందంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆప్ అగ్రనేత భగవంత్ మాన్ ఖండించారు. ఆప్ నేతలు, కార్యకర్తలు కలిసికట్టుగానే ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. తమ పార్టీపై శాసనసభ విపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వా (కాంగ్రెస్) చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు. 30 మంది పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ బజ్వా చేసిన వ్యాఖ్యలపై సీఎం మాన్ మండిపడ్డారు.
'ఇకనైనా మా ఎమ్మెల్యేలను లెక్కపెట్టడాన్ని బజ్వా ఆపేయాలి. దిల్లీలో వాళ్ల పార్టీకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారనేది చూసుకోవాలి' అని ఆయన ఎద్దేవా చేశారు. పంజాబ్‌లోని ఆప్ నేతలు స్వార్థాన్ని వదిలి, పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్నారని సీఎం మాన్ కితాబిచ్చారు.
కేజ్రీవాల్ కీలక భేటీ
'ఇంతకుముందు కూడా ప్రతాప్ సింగ్ బజ్వా ఇలాగే మాట్లాడారు. 20 నుంచి 40 మంది ఆప్ ఎమ్మెల్యేలు వాళ్ల (కాంగ్రెస్)తో టచ్‌లో ఉన్నారని చెప్పారు. వాళ్లను అలాగే మాట్లాడుకోనిద్దాం. ఆప్‌ను మేం మా చెమట, రక్తంతో ఏర్పాటు చేశాం. పల్లె నుంచి పట్టణం దాకా ప్రతిచోట ప్రజలతో మమేకం అవుతున్నాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోగా పంజాబ్‌ను రాష్ట్రాన్ని దేశంలోనే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతాం' అని సీఎం మాన్ పేర్కొన్నారు.
దిల్లీలోని కపుర్తలా హౌస్‌లో మంగళవారం ఉదయం పంజాబ్ సీఎం మాన్, రాష్ట్ర ఎమ్మెల్యేలతో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ భేటీ అయ్యారు. ఇది జరిగిన వెంటనే, పంజాబ్ ఆప్‌పై కాంగ్రెస్ నేతల ఆరోపణలను ఖండిస్తూ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్నందుకు పంజాబ్ మంత్రులు, ఎమ్మెల్యేలకు అరవింద్ కేజ్రీవాల్ ధన్యవాదాలు చెప్పారని ఆయన వెల్లడించారు.
STORY | Punjab CM Mann rubbishes Congress' claims of dissent in state unit of AAP
— Press Trust of India (@PTI_News) February 11, 2025
READ: https://t.co/RLDwS8FEX2
VIDEO: pic.twitter.com/mA7L6EaF9i
ఫలించని 'దిల్లీ మోడల్'! పంజాబ్‌లో వ్యూహం మార్చాల్సిందేనా?
'కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోం'- ఒకే రోజు షాక్ ఇచ్చిన ఆప్, టీఎంసీ