Kane Williamson ODI Record : పాకిస్థాన్‌లోని గడాఫీ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కివీస్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ ఓ అరుదైన ఘనతను సాధించాడు. సెంచరీ(133*) తో అదరగొట్టి వన్డేల్లో 7,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో విరాట్‌ను అధిగమించిన రికార్డుకెక్కాడు.
రెండో బ్యాటర్‌గా
ఈ క్రమంలోనే వేగంగా (159 ఇన్నింగ్స్) 7 వేల పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా విలియమ్సన్ అవతరించాడు. అయితే టీమ్ఇండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ (161 ఇన్నింగ్స్ లు) రికార్డును ఇప్పుడు కేన్ బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో హషీమ్ ఆమ్లా (151 ఇన్నింగ్స్) అగ్రస్థానంలో ఉన్నాడు. విలియమ్సన్ కంటే ముందు వేగంగా(186 ఇన్నింగ్స్) 7వేలు పరుగులు చేసిన కివీస్ బ్యాటర్‌గా మార్టిన్ గుప్టిల్ ఉన్నాడు.
#StatChat | Kane Williamson becomes just the fifth New Zealander to reach 7,000 ODI runs, following Ross Taylor, Stephen Fleming, Martin Guptill and Nathan Astle. He is the second fastest player in the history of the game to reach the milestone (159 innings). #CricketNation pic.twitter.com/PQF5G4TksX
— BLACKCAPS (@BLACKCAPS) February 10, 2025
సౌతాఫ్రికాపై కివీస్ గెలుపు
ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు పాకిస్థాన్ వేదికగా కివీస్, సౌతాఫ్రికా, పాక్ మధ్య ముక్కోణపు సిరీస్ జరుగుతోంది. ఇందులో భాగంగా సోమవారం లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై న్యూజిలాండ్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేశారు.
విలియమ్సన్ దూకుడు
305 పరుగుల భారీ లక్ష్యాన్ని కివీస్ ఎనిమిది బంతులు ఉండగానే ఛేదించింది. వన్ డౌన్‌లో వచ్చిన కేన్ విలియమ్సన్ (133*)సెంచరీ బాది జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కేన్ మామ దాదాపు 5 సంవత్సరాల 8 నెలల తర్వాత వన్డేల్లో శతకం బాదాడు. ఈ మ్యాచ్ లో విలియమ్సన్ 72 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఓపెనర్ డేవాన్ కాన్వే (97; 107 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. గ్లెన్ ఫిలిప్స్ (28*), విల్ యంగ్ (19), డారిల్ మిచెల్ (10) రన్స్ బాదారు.
సౌతాఫ్రికా బ్యాటర్లలో మాథ్యూ బ్రీట్జ్ కే (150) అరంగేట్రంలోనే శతకం కొట్టేశాడు. దీంతో వన్డేల్లో అరంగేట్రంలోనే 150 రన్స్ చేసిన తొలి ప్లేయర్‌గా రికార్డు సాధించాడు. వియాన్ ముల్డర్ (64), జాసన్ స్మిత్ (41) కూడా రాణించారు. ఫిబ్రవరి 12న పాకిస్థాన్, సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరగనుంది. దీంట్లో విజయం సాధించిన జట్టు ఫిబ్రవరి 14న జరిగే ఫైనల్లో కివీస్‌ను ఢీకొట్టనుంది.
ఒక్క సెంచరీ వల్ల ఏమీ మారదు- నాకు ఆ క్లారిటీ ఉంది : రోహిత్ శర్మ
14 ఏళ్ల తర్వాత లంక గడ్డపై ఆసీస్ గెలుపు - సిరీస్ క్లీన్ స్వీప్!