Smrithi Mandhana Boyfriend : స్మృతి మందాన - ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీమ్ఇండియా మహిళా జట్టు అందం ఈమె. ఆటపై మక్కువతో 16ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఈ ముంబయి ముద్దుగుమ్మ ప్రత్యర్థి ఎవరైనా పరుగుల వరద పారించడమే లక్ష్యంగా ఆడుతుంటుంది. తన బ్యాటింగ్ మాయాజాలంతో గత దశాబ్ద కాలంగా భారత మహిళల జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించింది. అలానే తన అందంతోనూ ఎంతో మంది కుర్రాళ్ల హృదయాన్ని దోచుకుంది. ఇప్పటికీ ఆమె కోసమే ఎంతో మంది మహిళల క్రికెట్‌ను చూస్తుంటారు.
అయితే ఈ క్రికెట్ అందం ఎవరితో డేటింగ్లో ఉందో తెలుసా? అతడి పేరు పలాష్ ముచల్. ఇతడు బాలీవుడ్ సింగర్ పాలక్ ముచల్ సోదరుడు. స్మృతి - పలాష్ ప్రేమలో ఉన్నారని గతంలో చాలా సార్లు రూమర్స్ వచ్చాయి. ఇద్దరు కలిసి ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. అయితే ఆ మధ్య మహిళల ప్రీమియర్ లీగ్ డబ్ల్యూపీఎల్ 2024 టైటిల్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కైవసం చేసుకున్న సమయంలో పలాష్ మరింత చర్చనీయాంశమయ్యాడు. ఎందుకంటే ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మందాన భుజంపై చేయి వేసి మరీ నిల్చున్నాడు. ఆ ఫొటోను అతడే స్వయంగా పోస్ట్ చేశాడు. దీంతో వారిద్దరు ప్రేమలో ఉన్నారని కన్ఫామ్ అయింది.
తాజాగా ఈ జంట మరో రెండు ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చూశారు. తమ బంధానికి ఐదేళ్లు పూర్తైనందని కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. లవ్ ఎమోజీతో '5' అని క్యాప్షన్ రాసిపెట్టారు. ఈ పిక్స్‌లో ఇద్దరు ఎంతో సంతోషంగా కేక్ కట్ చేస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్‌గా మారాయి. ఫ్యాన్స్ వారికి కంగ్రాట్స్ చెబుతున్నారు.