తెలంగాణ

telangana

ETV Bharat / sports

'వరల్డ్​కప్​కు సిరాజ్ వద్దు, పేసర్​గా అతడే బెటర్'- మాజీ క్రికెటర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ - T20 World Cup 2024 - T20 WORLD CUP 2024

Siraj T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌కి టీమ్‌ ఇండియా ఐదుగురు బౌలర్‌లుగా ఎవరిని ఎంపిక చేయాలి? అనే అంశంపై ఇర్ఫాన్‌ పఠాన్‌, శ్రీకాంత్‌ తమ విశ్లేషణలు వినిపించారు. ఈ సందర్భంగా టీమ్ఇండియా మాజీ ప్లేయర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌, పేసర్ సిరాజ్‌ గురించి ఏమన్నాడంటే?

Siraj T20 World Cup
Siraj T20 World Cup

By ETV Bharat Telugu Team

Published : Apr 29, 2024, 7:03 AM IST

Siraj T20 World Cup 2024:2024 ఐసీసీ టీ20 వరల్డ్​కప్‌కి భారత జట్టు ఎంపికపై ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. టీమ్‌లో ఒక్కో పొజిషన్‌ కోసం ఒకరి కంటే ఎక్కువ మంది భారత ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. ఐపీఎల్‌ 2024లో అద్భుతంగా రాణిస్తూ టీమ్‌ సెలక్షన్‌కు గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది క్రికెట్‌ ఎక్స్‌పర్ట్స్‌, మాజీ ఆటగాళ్లు టీమ్‌ కాంబినేషన్‌పై తమ విశ్లేషణలు వినిపిస్తున్నారు.

తాజాగా భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్లేయింగ్‌ 11లో ఐదుగురు బౌలర్లు ఎవరు? ఉండాలో వివరించాడు. 'ఐదుగురు బౌలర్లు తప్పనిసరి. వికెట్ ఆప్షన్లుగా మణికట్టు స్పిన్నర్లు బిష్ణోయ్, కుల్దీప్ ఆడతారు. బిష్ణోయ్ గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి. ఐపీఎల్‌లో రాణిస్తుండటంతో ఇప్పుడు అందరూ చాహల్ గురించి మాట్లాడుతున్నారు. కానీ ఫీల్డింగ్ కూడా కీలకమని మర్చిపోవద్దు' అన్నాడు.

'నా ఎంపికలో 8, 9, 10, 11 పొజిషన్లలో ఇద్దరు స్పిన్నర్లు, ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు ఉంటారు. దుబే, హార్దిక్, యశస్వి జైస్వాల్‌ వంటి ప్లేయర్‌లు నాలుగు ఓవర్లు బౌల్‌ చేయగలరు. ప్రస్తుతం టీమ్‌ఇండియా ఏం చేయబోతుందని పరిశీలిస్తే, నాకు తెలిసి రవీంద్ర జడేజాను 7వ స్థానంలో ఆడించవచ్చు. టామ్ మూడీ వ్యాఖ్యలతో నేను ఏకీభవిస్తున్నాను. జడేజా ఆ పొజిషన్‌కి బెస్ట్‌ ఆప్షన్‌ కాదు' అని చెప్పాడు.

బుమ్రాతోపాటు ఎవరు?
ప్రపంచకప్ జట్టులో ముగ్గురు పేసర్లు ఎవరనే దానిపై కూడా పఠాన్ స్పందించాడు. ప్రస్తుతం బ్లౌండ్‌గా సెలక్ట్‌ చేసుకోగలిగింది బుమ్రాని మాత్రమే. మరో ఇద్దరు పేసర్లు కావాలి. గతంలో సిరాజ్‌ దక్షిణాఫ్రికా సిరీస్ ఆడాడు. రెండు మ్యాచ్‌లలో ఒకటి లేదా రెండు వికెట్లు పడగొట్టాడు. మంచి ఎకానమీ ఉంది. దక్షిణాఫ్రికాపై వికెట్ల పరంగా అర్ష్‌దీప్‌ సంఖ్య గొప్పగా లేదు. కానీ ఐపీఎల్‌లో అర్ష్‌దీప్‌ గణాంకాలు మెరుగ్గా ఉంటాయి. సిరాజ్ ప్రదర్శన ఐపీఎల్ 2024లో బాగా లేదు. నేను సెలక్షన్ ప్యానెల్‌లో కూర్చుంటే, ఎక్స్‌పీరియన్స్‌ని ఓటు వేస్తాను. బుమ్రాతో పాటు అర్ష్‌దీప్‌, సిరాజ్‌ను తీసుకెళ్లమని చెబుతాను' అని పఠాన్‌ చెప్పాడు.

'ఇంకా ఖలీల్ అహ్మద్. మొహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్ వంటి వాళ్లు ఉన్నారు. మయాంక్ చాలా పాపులర్‌ అయ్యాడు. అతనికి పేస్ ఉంది, కానీ పెద్దగా క్రికెట్ ఆడలేదు. మోహ్సిన్‌ ఖాన్‌ కూడా హైట్‌ ఉంటాడు, దాదాపు 140తో బౌలింగ్‌ చేస్తాడు. అతనికీ పెద్దగా అనుభవం లేదు. ఇప్పుడు అతిపెద్ద సమస్య ఫాస్ట్ బౌలింగ్ కాంబినేషన్‌. కాబట్టి ఎక్స్‌పీరియన్స్‌కి ప్రాధాన్యం ఇవ్వడం మేలు. సిరాజ్, అర్ష్‌దీప్‌, బుమ్రాను ఎంపిక చేసుకోవచ్చు' అని వివరించాడు.

సిరాజ్‌ ఎందుకు?
పఠాన్ కో-ప్యానెలిస్ట్ కె శ్రీకాంత్ ఈ ఎంపికతో ఏకీభవించలేదు. బుమ్రా, అర్ష్‌దీప్‌తో పాటు సిరాజ్‌ని కాకుండా అవేష్ ఖాన్‌ను మూడో పేసర్‌గా తీసుకోవాలని పేర్కొన్నాడు. 'మూడో పేసర్‌గా సిరాజ్ కాలేడు. ఒక గేమ్‌లో బాగా బౌలింగ్ చేస్తాడు, ఆపై 10 గేమ్‌లలో రాణించడు. అతడు అస్థిరమైన బౌలర్. డెత్ ఓవర్లలో ఎవరు బాగా బౌలింగ్ చేస్తున్నారో చూడాలి. అవేష్ ఖాన్ చక్కగా బౌలింగ్‌ చేస్తున్నాడు. అతడికి కొద్దిగా అనుభవం కూడా ఉంది. వైడ్ యార్కర్లపై కూడా ప్రావీణ్యం సంపాదించాడు. నా మూడో పేసర్ అవేష్ ఖాన్. కాబట్టి సిరాజ్ ఎందుకు? అతను ప్రారంభంలో బౌలింగ్ చేయగలడు కానీ చివరిలో కాదు. నేను సిరాజ్‌ని తీసుకోను' అని చెప్పాడు.

'సిరాజ్​ను దానికోసమే పక్కనబెట్టాం' - బీసీసీఐ క్లారిటీ

Siraj 6 Wickets : వారెవ్వా సి'రాజ్​'.. మియాభాయ్ హిట్.. లంక ఫట్..

ABOUT THE AUTHOR

...view details