తెలంగాణ

telangana

ETV Bharat / sports

అందుకే అయ్యర్‌పై వేటు పడింది - అసలు కారణమిదే!

Shreyas Iyer BCCI Contract List : దేశవాళీ టోర్నీల్లో ఆడనందుకు వార్షిక కాంట్రాక్టులో ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌కు బీసీసీఐ చోటు కల్పించలేదన్న విషయం తెలిసిందే. అయితే అయ్యర్​ను తప్పించడానికి వెనక ఉన్న అసలు కారణం ఇప్పుడే తెలిసింది. అదేంటంటే?

అందుకే అయ్యర్‌పై వేటు పడింది - అసలు కారణమిదే!
అందుకే అయ్యర్‌పై వేటు పడింది - అసలు కారణమిదే!

By ETV Bharat Telugu Team

Published : Mar 2, 2024, 8:21 PM IST

Shreyas Iyer BCCI Contract List : దేశవాళీ టోర్నీల్లో ఆడనందుకు వార్షిక కాంట్రాక్ట్​ లిస్ట్​లో ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్​కు బీసీసీఐ చోటు కల్పించలేదన్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఇషాన్​ కిషన్‌పై వేటు వేస్తారని ముందే ఊహించారంతా. కానీ అయ్యర్‌ను తొలగించడానికి గల కారణాలు మాత్రం మొదట్లో సరిగ్గా తెలియలేదు.

ముందు శ్రేయస్‌ అయ్యర్‌ ఇంగ్లాండ్‌తో జరిగిన రెండు టెస్టుల్లోనూ ఆడాడు. అనంతరం గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఆ తర్వాత అతడు కాస్త ఫిట్ అయ్యాడని తెలిసింది. దీంతో అతడిని రంజీ టోర్నీ క్వార్టర్‌ ఫైనల్​లో ముంబయి తరఫున ఆడాలని బీసీసీఐ కోరింది. అయితే అతడు ఫిట్‌నెస్‌తో లేనని చెప్పి ఐపీఎల్‌ల్లో తాను సారథ్య బాధ్యతలు మోస్తున్న కోల్‌కతా జట్టుతో చేరి ప్రాక్టీస్‌ చేయడం మొదలు పెట్టాడు. దీనికి సంబంధించి చాలా వార్తలు కూడా బయటకు వచ్చాయి.

ఈ విషయం బీసీసీఐ చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ దృష్టికి వెళ్లింది. దీంతో అతడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. గాయాన్ని కారణంగా చూపి మ్యాచ్‌లకు దూరంగా ఉన్న అయ్యర్​పై వేటు వేశాడు. ఐపీఎల్‌ ప్రాక్టీస్‌ కోసం గాయాన్ని కారణంగా చూపడంతో అతడిపై వేటు పడింది.

"ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ను వార్షిక కాంట్రాక్ట్​ లిస్ట్​ నుంచి తప్పిస్తున్నాం. వారికి చోటు ఇవ్వడం లేదు. ప్లేయర్స్​ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించని సమయాల్లో దేశవాళీ టోర్నీల్లో కచ్చితంగా ఆడాల్సిందే. లేదంటే కఠిన చర్యలు ఉంటాయి" అంటూ బీసీసీఐ ఈ ఇద్దరు ప్లేయర్స్​పై వేటు వేసింది. అలా ముంబయి టీమ్​ తరఫున రంజీ క్వార్టర్‌ ఫైనల్​లో ఆడకపోవడంతో వార్షిక కాంట్రాక్ట్​ను పోగొట్టుకున్న శ్రేయస్‌ అయ్యర్‌ ఇప్పుడు తమిళనాడుతో జరగబోయే సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ ఆడబోతున్నాడని తెలిసింది.

ఇక ఇషాన్‌ కిషన్‌ దక్షిణాఫ్రికా టూర్​ నుంచి మానసిక పరిస్థితి బాగోలేదంటూ మధ్యలోనే స్వదేశానికి తిరిగొచ్చేశాడు. ఆ తర్వాత ఏ ఒక్క సిరీస్‌లోనూ ఆడలేదు. అయితే ఝార్ఖండ్‌ తరఫున రంజీల్లో పాల్గొనాలని బీసీసీఐ అతడిని కోరింది. అయినా అతడు పట్టించుకోకుండా ఐపీఎల్‌ కోసం హార్దిక్‌ పాండ్యాతో కలిసి ప్రాక్టీస్‌ చేశాడు. అది కాస్త చర్చనీయాంశమైంది. దీంతో బీసీసీఐ అతడిని కూడా వార్షిక కాంట్రాక్టు జాబితా నుంచి తొలగించింది.

50 మంది అతిథులకు రూ.100 కోట్ల ఖర్చు - క్రికెటర్లలో అత్యంత ఖరీదైన పెళ్లి ఎవరిదంటే?

ఆ మూడు రికార్డులపై ఫోకస్​ - 41 ఏళ్ల వయసులోనూ జేమ్స్ సూపర్ ఫామ్​

ABOUT THE AUTHOR

...view details