RCB New Captain : యంగ్ బ్యాటర్ రజత్ పటిదార్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ తమ జట్టు కెప్టెన్‌గా నియమించింది. 2025 ఐపీఎల్లో ఆర్సీబీ జట్టుకు రజత్ నాయకత్వం వహించనున్నట్లు గురువారం అధికారిక ప్రకటన చేసింది. ఈసారి టైటిల్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆర్సీబీ జట్టులో కీలక మార్పులు చేసింది. ఈ నేపథ్యంలోనే కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేసింది.
పటిదార్‌కు దేశవాళీలో నాయకత్వం వహించిన అనుభవం ఉంది. ఇదివరకు పటిదార్ విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీలో మధ్యప్రదేశ్ జట్టుకు కెప్టెన్సీగా చేశాడు. అయితే ముందునుంచి విరాట్ కోహ్లీ, కృనాల్ పాండ్య, భువనేశ్వర్ పేర్లు కూడా కెప్టెన్సీ పరిశీలనలో ఉన్నాయి. కానీ, భవిష్యత్‌లో లాంగ్ టర్మ్ జట్టులో కొనసాగాలన్న ఉద్దేశంతో యాజమాన్యం రజత్‌కే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ఇక కొత్త కెప్టెన్‌గా ఎంపికైన రజత్‌కు విరాట్సహా ఆర్సీబీ ప్లేయర్లు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతున్నారు.
కాగా, 31 ఏళ్ల రజత్ పటీదార్ భారత్ తరఫున గతేడాదే టెస్టుల్లోకి అరంగేట్రం చేయగా, 2023లో వన్డేల్లోకి వచ్చాడు. మూడు టెస్టులు, ఒకే ఒక్క వన్డే ఆడాడు. అయితే ఇప్పటి వరకు అంతర్జాతీయ టీ20లు ఆడిన అనుభవం అతడికి లేకపోవడం గమనార్హం. ఇక ఐపీఎల్ విషయానికొస్తే, 2021లో రజత్ అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 27 మ్యాచ్‌లు ఆడాడు. 34.74 సగటుతో 799 పరుగులు చేశాడు.
Welcome to your Raj, Ra-pa. 👑
— Royal Challengers Bengaluru (@RCBTweets) February 13, 2025
The baton has been passed, and your name has made it to the history books.
It’s time for a new chapter! Let’s give the best fans in the world what they’ve been waiting for all these years. 🙌 #PlayBold #ನಮ್ಮRCB #RCBCaptain #Rajat #RajatPatidar… pic.twitter.com/AKwjM9bnsq
కాగా, 2008- 2024 మధ్య సీజన్లలో ఆర్సీబీకి ఏడుగురు ప్లేయర్లు నాయకత్వం వహించారు.
- రాహుల్ ద్రవిడ్- 2008
- కెవిన్ పీటర్సన్- 2009 (స్టాండ్‌ఇన్ కెప్టెన్)
- అనిల్ కుంబ్లే- 2009-10
- డానియల్ వెటోరీ- 2011-12
- విరాట్ కోహ్లీ- 2011-2021, 2023 (స్టాండ్‌ఇన్ కెప్టెన్)
- షేన్ వాట్సన్- 2017 (స్టాండ్‌ఇన్ కెప్టెన్)
- ఫాఫ్ డుప్లెసిస్- 2022-2024
ఆర్సీబీ జట్టు ఐపీఎల్ 2025 : విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, దేవదత్ పడిక్కల్, స్వస్తిక్ చికారా,ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, లియామ్ లివింగ్‌స్టోన్, కృనాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, మనోజ్ భండాగే, జాకబ్ బెథెల్, జోష్ హేజిల్‌వుడ్, రసిఖ్ దార్, భువనేశ్వర్ కుమార్, నువాన్ తుషార, యష్ దయాల్, లుంగి న్గిడి, అభినందన్ సింగ్, సుయాష్ శర్మ, మోహిత్ రథీ