తెలంగాణ

telangana

ETV Bharat / sports

'నా పెద్ద కొడుకును అలానే చేశారు- ఇప్పుడు శాంసన్​ను కూడా!' - సంజు తండ్రి ఫైర్​! - SANJU SAMSON FATHER SLAMS KCA

కేరళ క్రికెట్ అసోషియేషన్​పై సంజూ శాంసన్ తండ్రి ఫైర్​ - తన కుమారుడికి అన్యాయం చేస్తున్నారని కామెంట్స్- ఏమైందంటే?

Sanju Samson Father
Sanju Samson (Getty Images)

By ETV Bharat Sports Team

Published : Jan 22, 2025, 10:33 AM IST

Sanju Samson Father Slams KCA :ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన జట్టులో టీమ్ఇండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్​కు చోటు కల్పించకపోవడం క్రికెట్ ప్రియుల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. వైట్​బాల్ క్రికెట్​లో సంజు రీసెంట్ ఫామ్ చూస్తే, అతడిని కచ్చితంగా ఎంపిక చేస్తారనే అంతా భావించారు. కానీ అతడిని సెలెక్ట్ చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో కేరళ క్రికెట్ సంఘంపై సంజూ శాంసన్ తండ్రి శాంసన్ విశ్వనాథ్ తీవ్ర ఆరోపణలు చేశారు. విజయ్ హజారే టోర్నీలో ఆడడని సంజూ శాంసన్ శిక్షణా శిబిరం ప్రారంభానికి ముందే తెలియజేశాడని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో కేసీఏపై శాంసన్ విశ్వనాథ్ తీవ్ర విమర్శలు గుప్పించారు.

'ఆ ప్రశ్నకు కేసీఏ దగ్గర ఆన్సర్ ఉందా?'
"శిక్షణా శిబిరంలో పాల్గొనని ఇతర ఆటగాళ్లు విజయ్ హజారేలో ఎలా ఆడారు. వాళ్లెవరో నాకు తెలుసు. దానికి కేసీఏ దగ్గర సమాధానం ఉందా?. సంజు కంటే ముందు నా పెద్ద కొడుకు సాలీ కేరళ తరఫున ఆడాడు. అండర్-19 జట్టు తరఫున సెంచరీ చేశాడు. ఆ తర్వాత రంజీ క్యాంప్​కు హాజరైన అతడు మంచి పెర్ఫామెన్స్ ఇచ్చాడు. కానీ అతనికి రంజీ ట్రోఫీ జట్టులో చోటు దక్కలేదు. ఆ తర్వాత కేరళ అండర్-25 జట్టులోకి వచ్చినా అవకాశాలు ఇవ్వలేదు." అని శాంసన్ విశ్వనాథ్ వ్యాఖ్యానించారు.

'శాంసన్​కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు'
కేరళ క్రికెట్ అసోసియేషన్​లో కొంతమందికి తన కుమారుడు శాంసన్ మీద వ్యతిరేకత ఉందని ఆరోపించారు విశ్వనాథ్. "సంజు కంటే ముందే భారత జట్టుకు ఆడాల్సిన నా పెద్ద కొడుకుకి అవకాశం దక్కలేదు. కేసీఏలో ఉన్న కొద్ది మంది వ్యక్తులు నా కుమారుడికి వ్యతిరేకంగా పనిచేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒకసారి రంజీ మ్యాచ్​లో సంజు రెండు మోకాళ్లకు గాయాలయ్యాయి. అప్పుడు విశ్రాంతి కోసం సెలవు అడగడానికి అప్పటి కేసీఏ అధ్యక్షుడి టీసీ మాథ్యూ వద్దకు వెళ్లాను. అతడితో చాలా గౌరవంగా మాట్లాడాను. కానీ నాతో అతడు వాగ్వాదానికి దిగారు. నాతో చాలా దారుణంగా మాట్లాడారు." అని ఓ ఇంటర్వ్యూలో శాంసన్ విశ్వనాథ్ ఆరోపించారు.

"పిల్లలు ఏం పొరపాటు చేశారో నాకు తెలియదు. ఏదైనా తప్పు చేసి ఉంటే నాకు ఫోన్ చేస్తే సమాధానం చెప్పేవాడిని. మేం ఎప్పుడూ కేసీఏకు వ్యతిరేకంగా లేము. కేసీఏలోని కొందరికే మాతో సమస్య. వారికి నమస్కారం పెట్టకపోయినా ఇబ్బందే. తాను మాట్లాడేది జయేశ్ జార్జ్ (కేసీఏ అధ్యక్షుడు), వినోద్ కుమార్ (బోర్డు కార్యదర్శి) గురించి కాదు. చిన్న చిన్న విషయాలకు ప్రతిదాన్ని విషంగా మార్చే కొంతమంది చిన్న వ్యక్తులు ఉన్నారు. నాకు కావలసిందల్లా సంజు ఆడటానికి న్యాయమైన అవకాశం. ఏదైనా తప్పు జరిగితే మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. దాన్ని సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం" అని శాంసన్ విశ్వనాథ్ పేర్కొన్నారు.

శాంసన్​కు దక్కని చోటు
మరోవైపు సంజు రీసెంట్​గా విజయ్ హజారే ట్రోఫీ ఆడకపోవడం వల్లే, జట్టు నుంచి తప్పించారనే వాదనలు వినిపిస్తున్నాయి. టీమ్​ఇండియాకు ఆడాలనుకునే ప్లేయర్స్ దేశవాళీ టోర్నీల్లో కచ్చితంగా ఆడాలి. కానీ సంజూ శాంసన్ మాత్రం విజయ్ హజారే ట్రోఫీలో ఆడలేదు. ఈ కారణంగానే అతడిని ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయకపోయినట్లు ప్రచారం సాగుతోంది.

అప్పుడు పృథ్వీ షా - ఇప్పుడు సంజు శాంసన్‌!- విజయ్ హజారే స్క్వాడ్ నుంచి స్టార్ క్రికెటర్ ఔట్!

సంజూ శాంసన్ ఖాతాలోకి అరుదైన ఘనత - 9 ఏళ్ల కెరీర్​లో ఇదే తొలిసారి! - Sanju First Chance in 9 Years

ABOUT THE AUTHOR

...view details