RR VS KKR IPL 2024 :ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తోన్న గువాహటిలో టాస్ వేయడానికి కంటే ముందు నుంచే ఈ వాన మొదలైంది. అయితే సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వరుణుడు కాస్త శాంతించగా, మ్యాచ్‌ను పునః ప్రారంభించారు. అయితే అప్పటికే ఆలస్యం అవ్వడం వల్ల 20 ఓవర్ల మ్యాచ్‌ను కాస్తా 7 ఓవర్ల మ్యాచ్‌గా మార్చారు.
దీంతో ఈ ఉత్కంఠ పోరులో టాస్ గెలిచిన కోల్‌కతా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. కానీ అంతలోనే తిరిగి వాన మొదలవ్వడం వల్ల మ్యాచ్‌కు మరోసారి అంతరాయం కలిగింది. సిబ్బంది వెంటనే పిచ్ మీదకు షీట్స్ తెచ్చి కప్పారు. వానా తగ్గుతుందని ఎదురుచూశారు. కానీ అలా జరగలేదు. దీంతో ఇకపై వర్షం తగ్గే సూచనలు కనిపించకపోవడం వల్ల మేనేజ్మెంట్ ఈ డెసిషన్ తీసుకుంది.
రాజస్థాన్‌కు ఇది ఎంతో కీలకమైన మ్యాచ్. ఇప్పటికే పంజాబ్‌పై హైదరాబాద్ జట్టు (17 పాయింట్లు) విజయం సాధించి రెండో స్థానానికి చేరింది. ప్రస్తుతం 16 పాయింట్లతో రాజస్థాన్ జట్టు మూడో స్థానంలో ఉంది. కోల్‌కతాపై గెలిస్తే తిరిగి రెండో స్థానానికి చేరుకుంటాది.
ఇప్పుడు ఈ మ్యాచ్ రద్దవ్వడం వల్ల రాజస్థాన్‌కు భారీ నష్టం కలిగింది. ఇరుజట్లకు చెరో పాయింట్లు రావడం వల్ల 17 పాయింట్లతో రాజస్థాన్ లీగ్ దశను ముగిస్తుంది. దీంతో హైదరాబాద్, రాజస్థాన్ సమానంగా నిలుస్తాయి. అప్పుడు రాజస్థాన్ (+0.273) కంటే మెరుగైన రన్‌రేట్ ఉన్న సన్‌రైజర్స్ (+0.414) రెండో స్థానంలోనే ఉంటుంది. మొదటి రెండు స్థానాల్లో ఉన్న జట్లు క్వాలిఫయర్- 1 ఆడతాయి. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుతుంది. ఓడినా కూడా మరో అవకాశం ఉంటుంది.
రాజస్థాన్ రాయల్స్ తుది జట్టు : సంజు శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), టామ్ కోహ్లర్-కాడ్మోర్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రోవ్‌మన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, అవేష్ ఖాన్, నాంద్రే బర్గర్.