ETV Bharat / sports

అన్నను వద్దన్నారు, తమ్ముడిని తీసుకున్నారు! - రంజీల్లో రాణించినా అతడికి నో ఛాన్స్! - SARFARAZ KHAN IPL 2025

ఐపీఎల్ మెగావేలంలో సర్ఫరాజ్ ఖాన్​కు ఎదురుదెబ్బ- అన్ సోల్డ్​గా మిగిలిపోయిన సర్ఫరాజ్ - అతడి తమ్ముడు ముషీర్​ను కొన్న పంజాబ్

Sarfaraz Khan, Musheer Khan
Sarfaraz Khan IPL 2025 (Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : Nov 26, 2024, 3:45 PM IST

Sarfaraz Khan IPL 2025 : టీమ్​ఇండియా యంగ్ బ్యాటర్ సర్భరాజ్ ఖాన్​కు తాజాగా జరిగిన మెగా వేలంలో చుక్కెదురైంది. అతడ్ని కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచెజీ కూడా ఆసక్తి చూపించకపోవడం క్రీడాభిమానులను నిరాశకు గురిచేసింది. అయితే అతడి సోదరుడు ముషీర్ ఖాన్​ను మాత్రం పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. దీంతో అభిమానులతో పాటు పలువురు మాజీలు సర్ఫారాజ్​కు ఎందుకిలా జరిగిందా అంటూ ఆరా తీస్తున్నారు.

తమ్ముడి వైపే ఫ్రాంచైజీల మొగ్గు
ఈ మెగా వేలంలో రూ.75 లక్షల బేస్ ధరతో సర్ఫరాజ్ వేలంలోకి వచ్చాడు. అయినప్పటికీ సర్ఫరాజ్​ను తీసుకునేందుకు ఐపీఎల్ ఫ్రాంచైజీలేవీ ముందుకు రాలేదు. రూ.30 లక్షల బేస్​ప్రైజ్​తో వచ్చిన ముషీర్ ఖాన్​ను పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. దీంతో 19 ఏళ్ల ముషీర్ ఖాన్ ఐపీఎల్ లో ఎంట్రీ ఇవ్వనున్నాడు.

రంజీల్లో రాణించినా నో ఛాన్స్!
రంజీల్లో టన్నుల కొద్దీ పరుగులు చేసిన సర్ఫరాజ్​ ఐపీఎల్ మెగా వేలంలో అన్​సోల్డ్​గా మిగిలిపోయాడు. కొద్దిరోజుల కిందటే న్యూజిలాండ్​పై బెంగళూరులో జరిగిన టెస్ట్ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్​లో సర్ఫరాజ్ 150 పరుగులు బాదాడు. అయినప్పటికీ సర్ఫరాజ్​ను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ముందుకు రాకపోవడం గమనార్హం. అయితే సర్ఫరాజ్ బ్యాటింగ్ స్టైల్ టీ20 ఫార్మాట్​​కు సెట్ కాదని అతడిని ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఐపీఎల్ కెరీర్
కాగా, సర్ఫరాజ్ ఖాన్ ఆర్​సీబీ తరఫున 2015లో ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ జట్టు తరఫున మూడేళ్లలో మొత్తం 25 మ్యాచ్​లు ఆడాడు. కానీ అంతగా రాణించలేకపోయాడు. తర్వాత పంజాబ్ కింగ్స్ తరఫున ఆడినా పెద్దగా అవకాశాలు రాలేదు. 2022, 23 సీజన్​లో దిల్లీ తరఫున ఆడాడు. అప్పుడు పెద్దగా అవకాశాలు రాలేదు. అరకొర మ్యాచ్​ల్లో ఛాన్స్ లు వచ్చినా సర్ఫరాజ్ తనను తాను నిరూపించకోలేకపోయాడు. మొత్తంగా 50 ఐపీఎల్ మ్యాచుల్లో 22.50 సగటుతో 585 పరుగులు చేశాడు. అందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది.

ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో బాదుడు
ముషీర్ ఖాన్ టీమ్​ఇండియా తరఫున ఈ ఏడాది జరిగిన అండర్ 19 వరల్డ్ కప్​లో ఆడాడు. అందులో ఓ సెంచరీ కూడా నమోదు చేసి ఔరా అనిపించాడు. అలాగే 9 ఫస్ట్ క్లాస్ మ్యాచ్​ల్లో ఏకంగా 716 రన్స్ బాదాడు. అందులో 3 శతకాలు, ఒక అర్ధ శతకం కూడా ఉంది. తాజాగా నిర్వహించిన ఐపీఎల్ మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ ముషీర్ ఖాన్​ను దక్కించుకుంది. వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ సీజన్​లో ముషీర్ మెగాటోర్నీలో ఎంట్రీ ఇవ్వనున్నాడు.

అశ్విన్​ టు భువీ - సొంతగూటికి చేరుకున్న ఐపీఎల్​ ప్లేయర్లు వీరే

IPL 2025 - అన్ని జట్ల ప్లేయర్ల పూర్తి లిస్ట్ ఇదే - ఎవరి కోసం ఎంత ఖర్చు పెట్టారంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.