Khairatabad RTA Got More Income From Fancy Numbers : రాష్ట్రంలో వాహనాల నంబర్ ప్లేట్లు టీఎస్ నుంచి టీజీగా మారిన నేపథ్యంలో ఫ్యాన్సీ నంబర్లకు రోజరోజుకు డిమాండ్ పెరుగుతోంది. తమకు ఇష్టమైన నంబర్‌ను, తమ లక్కీ నంబర్ వచ్చేలా ఎంత ఖర్చయినా చెల్లించడానికి సిద్ధంగా ఉంటున్నారు. దీంతో రాష్ట్రంలోని ఫ్యాన్సీ నంబర్లకు రోజురోజుకు పోటీ ఎక్కువగా ఉంటోంది. తాజాగా ఖైరతాబాద్ రవాణాశాఖ కార్యాలయానికి కాసుల పంట పండింది. ఫ్యాన్సీ నంబర్లతో ఖైరతాబాద్ రవాణాశాఖ కార్యాలయానికి ఒక్కరోజే రూ.52,52,283 ఆదాయం సమకూరింది అని హైదరాబాద్ జేటీసీ రమేశ్ తెలిపారు.
అత్యధికంగా TG 09 D 0001 నంబర్‌కు రూ. 11,11,111ల ఆదాయం వచ్చింది. ఈ నంబర్‌ను రుద్రరాజు రాజీవ్ కుమార్ ఆన్లైన్ బిడ్డింగ్‌లో దక్కించుకున్నారు. TG 09 D 0009 నంబర్‌కు రూ.10,40,000ల ఆదాయం లభించింది. ఈ నంబర్‌ను మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ కైవసం చేసుకుంది. TG 09 C 9999 నంబర్‌కు రూ. 7,19,999 ఆదాయం సమకూరింది. ఈ నంబర్‌ను శ్రీయాన్ కన్స్ట్రక్షన్స్ దక్కించుకుంది. TG 09 D 0006 నంబర్‌కు రూ. 3,65,000ల ఆదాయం సమకూరింది. ఈ నంబర్‌ను పోరుస్ ఆగ్రో పుడ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం కైవసం చేసుకుంది.
ఫ్యాన్సీ నంబర్లకు రూ. లక్షల్లోనూ ఆదాయం : TG 09 D 0005 నంబర్‌కు రూ. 3,45,000 ఆదాయం వచ్చింది. వెగా శ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ ఎల్ఎల్పీ యాజమాన్యం ఈ నంబర్‌ను దక్కించుకుంది. TG 09 D 0007 నంబర్‌కు రూ. 2,06,569ల ఆదాయం సమకూరింది. ఆన్లైన్ బిడ్డింగ్‌లో ఎన్.స్పిర మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ నంబర్‌ను కైవసం చేసుకుంది. TG 09 D 0019 నంబర్‌కు రూ.1,95,009 ఆదాయం రాగా ఈ నంబర్‌ను నంబర్ మల్ ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకుంది.
TG 09 D 0099 నంబర్‌కు రూ. 1,85,000 ఆదాయం లభించగా ఈ నంబర్‌ను సీఎస్కే రియల్టర్స్ లిమిటెడ్ సంస్థ చేజిక్కించుకుంది. TG 09 D 0077 నంబర్‌కు రూ. 1,17,789 ఆదాయం లభించింది. ఈ నంబర్‌ను మీనాక్షీ ప్రాపర్టీ మేనేజ్మెంట్ ఎల్ఎల్పీ యాజమాన్యం కైవసం చేసుకుంది. వీటితోపాటు మరికొన్ని ఫ్యాన్సీ నంబర్లకు లక్ష రూపాయల్లో ఆదాయం వచ్చింది.
మెచ్చిన కారుకు నచ్చిన నంబరు - ఖర్చు విషయంలో అసలు తగ్గేదే లే!
మనం మెచ్చిన బండికి - మనకు నచ్చిన నంబర్ - ఖర్చు ఎంతైనా తగ్గేదే లే