ETV Bharat / spiritual

తిరుచానూరు పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు - కనులారా చూస్తే జన్మధన్యం! - TIRUCHANUR PADMAVATI BRAHMOTSAVAM

తిరుచానూరు బ్రహ్మోత్సవం - అంకురార్పణ, సేనాధిపతి ఉత్సవం - టైమింగ్స్​ ఎలా ఉన్నాయంటే?

Tiruchanur Padmavati Brahmotsavam
Tiruchanur Padmavati Brahmotsavam (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 26, 2024, 8:00 PM IST

Tiruchanur Padmavati Brahmotsavam : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కార్తిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అమ్మవారి ఆలయంలో ఈ నెల 27వ తేదీన జరగనున్న అంకురార్పణ, విశ్వక్సేన పూజ విశిష్టతను తెలుసుకుందాం.

అంకురార్పణ
తిరుమల శ్రీనివాసునికి వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగినట్టుగానే, తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారికి కూడా ప్రతి సంవత్సరం కార్తిక మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. బ్రహ్మోత్సవాలు ఎలాంటి అవరోధాలు, ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగాలని బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ఒక రోజు ముందు అంకురార్పణ నిర్వహించడం సంప్రదాయం. ఈ నెల 27వ తేదీ అంకురార్పణ కార్యక్రమం జరుగనున్న సందర్భంగా అసలు అంకురార్పణ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

అంకురార్పణ అంటే!
అంకురార్పణ కార్యక్రమంలో భాగంగా అమ్మవారి ఉద్యానవనంలో సేకరించిన పుట్ట మన్నును సాయంత్రం శాస్త్రోక్తంగా ఆలయానికి తీసుకువస్తారు. నవ ధాన్యాలను పుట్ట మన్నులో వేసి అంకురార్ఫణకు శ్రీకారం చుడతారు. వైఖానస ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యత ఉంది. విత్తనాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు.

సూర్యాస్తమయం తర్వాతే!
అంకురార్పణలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సూర్యుడు అస్తమించిన తరువాతే అంకురార్పణ నిర్వహిస్తారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రుడిని ‘సస్యకారక’ అంటారు. అంటే పంటలు పండించే వాడని అర్థం. ఈ కారణంగా పగటివేళ కాకుండా సాయంత్రం వేళ మంచి ముహూర్తంలో అంకురార్పణ కార్యక్రమం నిర్వహిస్తారు.

పాలికలలో పవిత్ర విత్తనాలు
అంకురార్పణంలో పలు పవిత్ర విత్తనాలు నాటుతారు. అంకురార్పణంలో నాటే విత్తనాలు బాగా మొలకెత్తుతాయి. విత్తనాలు బాగా మొలకెత్తడం వల్ల ఉత్సవాలు కూడా గొప్పగా జరుగుతాయని విశ్వాసం. విత్తనాలు నాటేందుకు పాలికలు అనే మట్టి కుండలను వినియోగిస్తారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న యాగశాలలో ఈ మొత్తం కార్యక్రమం నిర్వహిస్తారు. అత్రి మహర్షి తన ‘సముర్తార్చన అధికరణ’ అనే గ్రంథంలో అంకురార్పణ క్రమాన్ని విపులంగా వివరించారు.

దేవతలకు ఆహ్వానం
అంకురార్పణ కార్యక్రమం జరగడానికి ముందు, ఆ రోజు మధ్యాహ్నం వేళ విత్తనాలను కొత్త పాత్రలో నీటిలో నానబెడతారు. అంకురార్పణ నిర్వహించే ప్రదేశాన్ని ఆవు పేడతో అలుకుతారు. ఇక్కడ బ్రహ్మ పీఠాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ తరువాత అగ్నిహోత్రం ద్వారా దేవతలను ఆహ్వానిస్తారు.

శాస్త్రోక్తంగా అంకురార్పణ
ఆ తరువాత భూమాతను ప్రార్థిస్తూ పాలికలను మట్టితో నింపి, చంద్రుడిని ప్రార్థిస్తూ అందులో విత్తనాలు చల్లి నీరు పోస్తారు. ఈ పాలికలకు నూతన వస్త్రాన్ని అలంకరించి పుణ్యాహవచనం నిర్వహిస్తారు. ప్రతిరోజూ ఈ పాలికల్లో కొద్దిగా నీరు పోస్తారు. ఈ మొత్తం కార్యక్రమం వేద మంత్రోచ్ఛారణ, మంగళ వాయిద్యాల నడుమ సాగుతుంది.

సేనాధిపతి ఉత్సవం
పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాల అంకురార్పణలో భాగంగా 27వ తేదీన అంటే బుధవారం సాయంత్రం స్వామి ఉత్సవర్లైన సేనాధిపతి వారిని తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం చుట్టూ ఉన్న నాలుగు మాడ వీధుల్లో ఘనంగా ఊరేగిస్తారు. అనంతరం ఆలయ పూజారులు ఆలయంలో పుణ్యాహవచనం, రక్షా బంధనం కార్యక్రమాలు నిర్వహిస్తారు. విశ్వక్సేనుల ఊరేగింపు ముందు తిరువీధుల్లో దేదీప్యమానమైన వెలుగు జిలుగుల మధ్య గజ, తురగ, నంది కదులుతుండగా భక్తుల కోలాటాలు, భగవన్నామ స్మరణ మధ్య అత్యంత వైభవంగా ఊరేగింపును నిర్వహిస్తారు.

శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ముందుగా నిర్వహించే అంకురార్పణ, సేనాధిపతి ఉత్సవం చూసిన కనులకు భాగ్యం! దర్శించిన వారికి మహద్భాగ్యం! - ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.