ETV Bharat / sports

ఐసీసీపై జై షా టీమ్ ఫుల్ ప్రెజర్! - ఛాంపియన్స్ ట్రోఫీ వేదికపై ఫైనల్ డెసిషన్ ఆ రోజే!

నవంబర్ 29న ఐసీసీ వర్చువల్ మీటింగ్​ - అందులో ఏం చర్చించనున్నారంటే?

ICC Champions Trophy 2025
ICC Champions Trophy 2025 (Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : Nov 26, 2024, 7:29 PM IST

ICC Champions Trophy 2025 : వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరగనున్న ఛాంపియన్స్‌ ట్రోఫీ షెడ్యూల్‌, వేదికలపై చర్చించేందుకు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ఈ నెల 29న వర్చువల్‌గా సమావేశం కానుంది. ఛాంపియన్స్‌ ట్రోఫీ పాకిస్థాన్​ వేదికగా జరగాల్సి ఉండగా, ఆ దేశం వెళ్లి ఆడేందుకు భారత్‌ నిరాకరిస్తోంది. 2008లో ముంబయిపై ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్​ భారత్‌ క్రికెట్‌ జట్టు పర్యటించలేదు. పాక్‌ వెళ్లకూడదనే భారత్‌ ప్రభుత్వ నిర్ణయంతో ఛాంపియన్స్‌ ట్రోఫీ షెడ్యూల్‌ ఖరారులో ఆలస్యం జరుగుతోంది.

ఈ క్రమంలో ఛాంపియన్స్‌ ట్రోఫీని హైబ్రిడ్‌ మోడల్‌లో నిర్వహించాలని టీమ్ఇండియా కోరుతోంది. భారత్‌ ఆడే మ్యాచ్‌లు పాక్‌లో కాకుండా వేరే దేశంలో నిర్వహించాలని బీసీసీఐ కోరుతోంది. పాక్‌ బదులు యూఏఈలో ఆడేందుకు సిద్ధమని చెబుతోంది. అందుకు పాకిస్థాన్ అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో నవంబర్‌ 29న జరిగే ఐసీసీ బోర్డు సమావేశం కీలకంగా మారింది. బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జైషా ఐసీసీ ఛైర్మన్‌గా డిసెంబర్‌ 1న బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఇదిలా ఉండగా, కొత్త పాలక వర్గం బాధ్యతలు చేపట్టే ముందే ఛాంపియన్స్‌ ట్రోఫీపై ఒక నిర్ణయం తీసుకోవాలని జై షా సహా ఇతర సభ్యులు ఐసీసీపై ఒత్తిడి తెస్తున్నారు. చివరి నిమిషం వరకు ఛాంపియన్స్‌ ట్రోఫీ షెడ్యూల్‌, వేదికలపై ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని వారు ప్రస్తుత కార్యవర్గంపై మండిపడుతున్నారు. మరోవైపు హైబ్రిడ్‌ మోడల్‌కు అంగీకరిస్తే పాకిస్థాన్​ క్రికెట్‌ బోర్డుకు ఆర్థిక ప్రోత్సాకాలు ఇచ్చేందుకు కూడా ఐసీసీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత ఏడాది పాకిస్థాన్​ ఆతిథ్యమిచ్చిన ఆసియాకప్‌ కూడా హైబ్రిడ్‌ పద్ధతిలోనే జరిగింది. పాకిస్థాన్​లో భారత్‌ ఆడాల్సిన మ్యాచ్‌లు శ్రీలంకలో జరిగాయి.

అయితే 1996లో ప్రపంచ కప్‌ను సంయుక్తంగా నిర్వహించాక ఐసీసీ ఈవెంట్‌కు పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనుండటం ఇదే తొలిసారి. అందుకే కోట్లాది రూపాయలు ఖర్చు చేసి కరాచీ, లాహోర్‌, రావల్పిండి స్టేడియాలను పాకిస్థాన్​ క్రికెట్‌ బోర్డు ఆధునికీకరించింది. 2009లో పాకిస్థాన్​లో శ్రీలంక క్రికెట్‌ జట్టుపై భయంకర దాడి ఘటన తర్వాత అనేక దేశాలు పాక్‌ వెళ్లి ఆడేందుకు నిరాకరించాయి. కానీ ఇటీవలే ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా వంటి జట్లు పాకిస్థాన్​లో పర్యటించాయి. వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్‌ ట్రోఫీ ఆతిథ్య హక్కులను 2021లో పాకిస్థాన్​కు ఐసీసీ అప్పగించగా, అన్ని మ్యాచ్‌లూ పాక్‌లోనే నిర్వహించాలని పీసీబీపై ఆ దేశంలో అన్ని వర్గాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది.

మరోవైపు ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆడేందుకు పాకిస్థాన్​కు భారత జట్టు రాకపోతే తాము కూడా భవిష్యత్తులో భారత్‌ వేదికగా జరిగే ఐసీసీ ఈవెంట్లకు తమ జట్టును పంపబోమని పాకిస్థాన్​ ఇప్పటికే హెచ్చరించింది. గత ఏడాది వన్డే ప్రపంచ కప్‌ సందర్భంగా భారత్‌లో పాకిస్థాన్​ జట్టు పర్యటించింది. దాయాదుల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగకపోవడంతో ఐసీసీ ఈవెంట్లు, ఆసియాకప్‌ వంటి టోర్నీల్లో మాత్రమే భారత్‌- పాకిస్థాన్​ జట్లు పరస్పరం తలపడుతున్నాయి.

బీసీసీఐ, పీసీబీతో ఐసీసీ అత్య‌వ‌స‌ర స‌మావేశం - ఆ ఐదు అంశాలపై చర్చ!

ఛాంపియన్స్ ట్రోఫీ - పాక్‌ను ఒప్పించేందుకు ఐసీసీ తెర వెనక ప్రయత్నాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.