Rohit Sharma Investments:టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం కెరీర్లో పీక్స్‌లో ఉన్నాడు. మూడు ఫార్మాట్లలో జట్టుకు నాయకత్వం వహిస్తున్న హిట్‌మ్యాన్ బ్యాట్‌తోనూ అదరగొడుతున్నాడు. ప్రస్తుతం ప్రపంచ అత్యుత్తమ క్రికెటర్లలో రోహిత్ ఒకడు. ఈ నేపథ్యంలో రోహిత్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో రికార్డులు క్రియేట్ చేశాడు.
ఇటీవల పొట్టి క్రికెట్ ఫార్మట్‌లో 250 విజయాల్లో భాగమై అరుదైన రికార్డును కూడా దక్కించుకున్నాడు. ఇక అంతర్జాతీయ వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు, టీ20ల్లో అత్యధిక సెంచరీలు (5) చేసిన ఆటగాడు కూడా రోహిత్ శర్మనే కావడం విశేషం. ఇలా క్రికెట్లోనే కాకుండా వ్యాపారంపైనా దృష్టి ఆ రంగంలోనూ రాణిస్తున్నాడు. దీంతో ప్రస్తుతం రోహిత్ నెట్‌వర్త్ రూ.230 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి రోహిత్ ఏయే రంగాల్లో పెట్టుబడులు పెట్టాడో మీకు తెలుసా?
వ్యాపారంలో పెట్టుబడులు:రాపిడోబోటిక్స్, వీరూట్స్ వెల్నెస్ సొల్యూషన్స్ వంటివి రోహిత్ శర్మ పెట్టుబడుల్లో ప్రధానమైనవి. ఈ రెండు అతిపెద్ద స్టార్టప్స్‌లో రోహిత్ పెట్టుబడులు రూ.88 కోట్లు దాకా ఉన్నట్లు సమాచారం. రోబోటిక్ ఆటోమేషన్ పరిష్కారాలను అందించే సంస్థ రాపిడోబోటిక్స్. ఇక వెరూట్స్ వెల్నెస్ సొల్యూషన్స్ ఒక హెల్త్ కేర్ కంపెనీ. ఈ రెండు పెట్టుబడులు టెక్నాలజీ, సాధారణ ప్రజల ఆరోగ్యంపై రోహిత్ శర్మకు ఉన్న అవగాహనను తెలియజేస్తున్నాయి.
రాపిడోబోటిక్స్ కంపెనీలో తన పెట్టుబడులను ధ్రువీకరించడానికి రోహిత్ ఒక సింగిల్ ఇన్వెస్ట్మెంట్ రౌండ్లో పాల్గొన్నాడు. వియూట్స్ వెల్నెస్ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్ 2018లో ఏర్పాటైంది. ఇదేవిధంగా పొలాలు, చేపల పెంపకం నుంచి సేకరించిన వివిధ రకాల మాంసం ఉత్పత్తులు, సీఫుడ్స్ అందించే మరో ఫ్లాట్‌ఫామ్‌లో కూడా రోహిత్ పెట్టుబడులు ఉన్నాట్లు తెలుస్తోంది.