Rishabh Pant Comeback:టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ రిషభ్ పంత్ క్రికెట్లోకి రీ ఎంట్రీ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక అతడు 2024 ఐపీఎల్లో దిల్లీ తరఫున బరిలోకి దిగేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. యాక్సిడెంట్ తర్వాత కోలుకుంటున్న రిషభ్‌కు, ఎన్సీఏ (National Cricket Academy) మార్చి 5న క్లియరెన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే అతడు ఐపీఎల్ ఫ్రాంఛైజీ దిల్లీ క్యాపిటల్స్ క్యాంప్‌లో చేరనున్నాడు. అయితే ఈ విషయంపై జట్టు మెంటార్ సౌరభ్ గంగూలీ స్పందించాడు.
'పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. కానీ, ఇప్పటికీ టోర్నీలో పంత్ కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యే ఛాన్స్ ఉంది. మార్చి 5న ఎన్సీఏ పంత్‌కు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత అతడి కెప్టెన్సీ విషయం గురించి ఆలోచిస్తాం. పంత్‌కు క్రికెట్లో లాంగ్ కెరీర్ ఉంది. అందుకే మేం అతడి పట్ల జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాం. ఇప్పుడే అతడిపై పనిభారం పెట్టలేం. ఎన్సీఏ నుంచి రిలీజ్ అయ్యాక, అతడు దిల్లీ క్యాంప్‌లో చేరతాడు. అప్పుడు పంత్ కమ్‌బ్యాక్, వికెట్ కీపింగ్ గురించి అతడితో మాట్లాడి ఓ నిర్ణయం తీసుకుంటాం. అతడు ఐపీఎల్ నాటికి ఫిట్‌గా లేకపోతే మాకు రికీ భుయ్, షయ్ హోప్, స్టబ్స్ వికెట్ కీపింగ్ కోసం ఉన్నారు' అని గంగూలీ అన్నాడు.
ఇక పంత్ 2022 డిసెంబర్లో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అప్పట్నుంచి టీమ్ఇండియాకు దూరమయ్యాడు. అతడు గతేడాది ఐపీఎల్, 2023 డబ్ల్యూటీసీ ఫైనల్, ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్‌నకూ దూరమయ్యాడు. అయితే ప్రస్తతం పంత్ బ్యాటింగ్‌తోపాటు, వికెట్ కీపింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు. కానీ, దిల్లీ మేనేజ్మెంట్ అతడికి ఆ బాధ్యతలు ఇస్తుందా లేదా అనేది ఫుల్ కాన్ఫిడెంట్‌గా పంత్- 2024 IPL లో బరిలోకి దిగడం పక్కా!