Rinku Singh IPL 2025 :2025 ఐపీఎల్ రిటెన్షన్స్‌పై క్లారిటీ వచ్చేసింది. అన్ని ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకున్న ప్లేయర్ల లిస్ట్ రిలీజ్ చేశాయి. ఈ క్రమంలో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ యంగ్ ప్లేయర్ రింకూ సింగ్‌ను రూ.13కోట్ల భారీ ధరకు అట్టిపెట్టుకుంది. అయితే తనను కేకేఆర్ రిటైన్ చేసుకోవడం పట్ల రింకూ కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశాడు.
'మా ప్రేమ కథ ఇప్పుడే మొదలైంది. ఇంకా సినిమా మిగిలే ఉంది' అంటూ పోస్ట్‌కు క్యాప్షన్ రాసుకొచ్చాడు. 'కేకేఆర్ ఫ్యామిలీకి నమస్తే. 7ఏళ్ల కిందట నేను కోల్‌కతా జెర్సీ వేసుకున్నా. ఇది నా ఒక్కడి విజయగాథ కాదు. నా ప్రతి విజయంలో, ఓటమిలో నాకు మద్దతుగా ఉన్నారు. ఈ ప్రయాణంలో చాలా నేర్చుకున్నా. కేకేఆర్ నాపై నమ్మకం ఉంచింది. ఆ నమ్మకాన్ని నిలుపుకుంటా. ఇది ఓ కొత్త అధ్యాయం' అని వాయిస్ మెసేజ్‌తో ఉన్న వీడియో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. దీనికి 'వెల్ డన్ ఛాంప్', 'ఆల్ ది బెస్ట్' అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
దీపావళి బోనస్!
2024 ఐపీఎల్ సీజన్‌కు గాను రింకూకు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీ రూ.55 లక్షలు చెల్లించింది. దీనిపై అప్పట్లో కేకేఆర్ యాజమాన్యం సోషల్ మీడియా విమర్శలు కూడా ఎదుర్కొంది. నిలకడగా రాణిస్తున్న భారత ఆటగాడికి తక్కువ ఫీజు చెల్లిస్తున్నారంటూ నెటిజన్లు ఫైర్ అయ్యారు. అయితే ఈసారి అతడి శాలరీ అమాంతం పెరిగింది. ఈసారి రింకూకు కేకేఆర్ రూ. 13కోట్లు ఇచ్చి అట్టిపెట్టుకుంటోంది. అంటే అతడి శాలరీ దాదాపు 2000 శాతం హైక్ అయినట్లే!