తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఫైనల్స్​లో ఆర్సీబీ ఘన విజయం - 'ఈ సాలా కప్ నమ్​దే' - RCB VS DC WPL Final 2024

RCB VS DC WPL Final : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్​లో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించింది. ఎనిమిది వికెట్ల తేడాతో దిల్లీ జట్టుపై గెలుపొందింది.

RCB VS DC WPL Final
RCB VS DC WPL Final

By ETV Bharat Telugu Team

Published : Mar 17, 2024, 10:37 PM IST

Updated : Mar 17, 2024, 10:50 PM IST

RCB VS DC WPL Final :ఉమెన్స్ ప్రీమియర్ లీగ్​లో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించింది. ఎనిమిది వికెట్ల తేడాతో దిల్లీ జట్టుపై గెలుపొందింది. తొలుత దిల్లీని 113 పరుగులకే కట్టడి చేసిన ఆర్సీబీ, ఆ తర్వాత స్వల్ప లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

ఎలిసా పెర్రీ 35 పరుగులు చేసి జట్టుకు కీలక ఇన్నింగ్స్ అందించింది. ఇక తనతో పాటు జట్టు కెప్టెన్ స్మృతి మంధాన 31 పరుగులు, సోఫీ డివైన్ 32 పరుగులతో రాణించారు.తొలివికెట్‌కు ఈ ద్వయం 49 పరుగుల మంచి శుభారంభం అందించారు. ఆ తర్వాత బరిలోకి దిగిన పెర్రీ, రిచా ఘోష్‌ జట్టును విజయతీరాలకు చేర్చారు.

మ్యాచ్ జరిగిందిలా :
టాస్ గెలిచి బరిలోకి దిగిన దిల్లీ జట్టును ఆర్సీబీ బౌలర్లు చురుగ్గా కట్టడి చేశారు. అలా దూకుడుగా ఆడుతూ వచ్చిన ఆ జట్టును కట్టుదిట్టంగా బంతులు వేసి ఉక్కిరిబిక్కిరి చేశారు. ఫలితంగా ఆ జట్టు 113 పరుగులను మాత్రమే స్కోర్ చేసి కుప్పకూలింది. ఓపెనర్లు షెఫాలి వర్మ (44), మెగ్ లానింగ్ (23) తప్ప మిగతావారెవరూ రెండంకల స్కోర్ చేయలేకపోయారు. దీంతో తొలి వికెట్‌కు 64 పరుగుల జోడించిన దిల్లీ ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి డీలా పడింది. ఇక బెంగళూరు బౌలర్లలో శ్రేయాంకా పాటిల్‌ 4, సోఫీ మోలినక్స్ 3, ఆశా శోభన 2 వికెట్లు పడగొట్టారు.

దిల్లీ జట్టు :
మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, అలిస్ క్యాప్సే, జెమిమా రోడ్రిగ్స్, మారిజానే కాప్, జెస్ జోనాసెన్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, తానియా భాటియా (వికెట్ కీపర్), శిఖా పాండే, మిన్ను మణి

ఆర్సీబీ జట్టు :
స్మృతి మంధాన (కెప్టెన్), సోఫీ డివైన్, సబ్బినేని మేఘన, ఎల్లీస్ పెర్రీ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), సోఫీ మోలినిక్స్, జార్జియా వేర్‌హామ్, శ్రేయాంక పాటిల్, దిశా కసత్, ఆశా శోభన, రేణుకా ఠాకూర్ సింగ్.

గ్లాస్‌ బ్రేకింగ్‌ ఇన్నింగ్స్‌ - పెర్రీకి టాటా సంస్థ స్పెషల్ గిప్ట్​

థ్రిల్లింగ్​ విక్టరీ- ఫైనల్​కు దూసుకెళ్లిన బెంగళూరు- ముంబయికి షాక్​

Last Updated : Mar 17, 2024, 10:50 PM IST

ABOUT THE AUTHOR

...view details