Ravindra Jadeja Test Series :రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్ట్‌లో టీమ్ఇండియా ప్లేయర్లు అదరగొట్టారు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన కెప్టెన్ రోహిత్ శర్మ 131 పరుగులు చేసి శుభారంభాన్ని అందించాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా కూడా 110 పరుగులు చేసి జట్టుకు కీలక ఇన్నింగ్స్ అందించారు. ఇక తనతో పాటు మైదానంలో ఉన్న సర్ఫరాజ్ ఖాన్ కూడా డెబ్యూ మ్యాచ్‌లోనే సత్తా చాటాడు. అప్పటి వరకు నిలకడగా ఆడిన సర్ఫరాజ్ 62 పరుగులకు రనౌట్ అయ్యి పెవిలియన్ బాట పట్టాడు. దీంతో తన కారణంగా సర్ఫరాజ్ ఔటయ్యాడంటూ సోషల్ మీడియా వేదికగా జడ్డూ అతడికి క్షమాపణలు చెప్పాడు.
ఇక ఇదే విషయంపై సర్ఫరాజ్ కూడా స్పందించాడు. "మా ఇద్దరి మధ్య జరిగిన మిస్‌కమ్యూనికేషన్ వల్ల అలా జరిగింది. జడ్డూ భాయ్ నా దగ్గరికి వచ్చి సారీ చెప్పాడు. నేను తనకు పర్లేదు అని రిప్లై ఇచ్చాను. దీనికంటే ముందు నేను అతడికి థ్యాంక్స్ చెప్పాలి. క్రీజ్‌లో ఉన్నంత సేపు అతను నాకు ఎంతో సపోర్ట్ చేశాడు. "
ఇక మ్యాచ్ విషయానికి వస్తే - తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 326-5తో నిలిచింది. కెప్టెన్ రోహిత్ శర్మ (131 పరుగులు), రవీంద్ర జడేజా (110* పరుగులు) సెంచరీలతో రాణించారు. టెస్టు కెరీర్లో రోహిత్‌కు ఇది 11వ సెంచరీ కాగా, జడేజాకు ఇది 4వ శతకం. అరంగేట్ర ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ (62 పరుగులు, 66 బంతుల్లో) ధనాధన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. క్రీజులో రవీంద్ర జడేజా (110), కుల్దీప్ యాదవ్ (1) ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 3, టామ్ హర్ల్టీ 1 వికెట్ దక్కించుకున్నారు.