Ranji Trophy 2024 Top Performers :క్రికెట్లో ఎంతో మంది స్టార్ ప్లేయర్లు తమ కెరీర్‌ను రంజీతోనే మొదలుపెట్టుంటారు. అన్ని ఫార్మాట్లలోనూ ఈ ఫస్ట్ క్లాస్ టోర్నీకి ఓ ప్రత్యేకత ఉంది. ఈ ఏడాది కూడా రంజీ టోర్నీ ఎంతో అత్యద్భుతంగా సాగుతోంది. ఎంతో మంది స్టార్ ప్లేయర్లు ఈ టోర్నీలో అదరగొడుతున్నారు. వారెవరంటే?
రికీ భుయ్ (ఆంధ్రప్రదేశ్) :
ఆంధ్రా జట్టుకు చెందిన ఈ బ్యాటర్ ఆడిన 13 ఇన్నింగ్స్‌ల్లో 75.16 సగటుతో 902 పరుగులు చేశాడు. అందులో నాలుగు సెంచరీలు, మూడు అర్ధసెంచరీలు ఉన్నాయి. రికీ భుయ్ అత్యుత్తమ స్కోరు 175 పరుగులు. ఈ టోర్నీలో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్.
సచిన్ బేబీ (కేరళ) :
కేరళకు చెందిన ఈ యంగ్ ప్లేయర్ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో నాలుగు సెంచరీలు, నాలుగు అర్ధసెంచరీలతో 58.45 సగటుతో 830 పరుగులు స్కోర్ చేశాడు. ఈ టోర్నీలో అతడి అత్యుత్తమ స్కోరు 131.
ఛెతేశ్వర్ పుజారా (సౌరాష్ట్ర):
టీమ్ఇండియాకు చెందిన ఈ స్టార్ క్రికెటర్ ఆడిన 13 ఇన్నింగ్స్‌లలో మూడు సెంచరీలు, రెండు అర్ధసెంచరీలతో చెలరేగిపోయాడు. 69.08 సగటుతో 829 పరుగులు చేశాడు. ఇక ఈ టోర్నీలో పుజారా అత్యుత్తమ స్కోరు 243.